Big News : ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాసియాలొని తమ కమాండర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ట్రంప్

Share the Post
#Bharatjago : గత తొమ్మిది రొజులలొ ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లొ పెద్ద ఏత్తున నాలుగుసార్లు జరిగిన బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులలొ 170 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు తామే భాద్యత వహిస్తున్నట్టు పాకిస్థాన్ తాలిబాన్లు, ISIS  ప్రకటించుకున్నారు.
 
తీవ్రవాదం పై సరయిన చర్యలు తీసుకొవడం లేదని ఇప్పటికే పాకిస్థాన్ పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ కు చేయవలసిన 13,000 కొట్ల సహాయన్ని ఆపివేసిన సంగతి తెలిసిందే …. ఇప్పుడు ఈ బాంబు దాడులతొ కొపం, నషాళాని కెక్కిన డొనాల్డ్ ట్రంప్ …. అఫ్ఘనిస్థాన్ తొ సహా, దక్షిణాసియాలొ ఉన్న తమ కమాండర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
మీరు ఏం చేస్థారొ, ఏలా చేస్థారొ మీ ఇష్టం …… ఏట్టి పరిస్తితులలొ కాబూల్ దాడులకు కారనమైన వారిని, ఇతర తీవ్రవాద స్థావరాలపై నేరుగా మీరే దాడి చేయండి. మీకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నాను. ఆఫ్గనిస్థాన్,అమెరికా లపై గురిపెట్టిన తీవ్రవాదులు ఏక్కడున్నా (పాకిస్థాన్) ఆ స్థావరాలపై దాడులు చేయండి.
 
అని స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్,  ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాసియా ప్రాంతాలలొని తమ కమాండర్లకు నిన్న రాత్రి ఆదేశాలు జారి చేసినట్టు తెలుస్తుంది. వారం రొజుల క్రితం పాకిస్థాన్ ట్రైబల్ ప్రాతమైన కొర్రం లొని తీవ్రవాద స్థావరం పై ద్రొణ్ దాడి చేసి హక్కాని కమాండర్ తొ సహా ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
 
ఈ సంధర్బంగా అమెరికన్ సహాయ రక్షణ మంత్రి జాన్ సులివన్ మాట్లాడుతూ “పాకిస్థాన్ విషయంలొ మరొక మాటకు అవకాశమే లేదు. ఇప్పటికే మేము చెప్పవలసింది స్పష్టంగా చెప్పాము” అని ఖటినంగా స్పందించారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!