సరిహద్దుల వద్ద చైనా ను “ఢీ” కొట్టడానికి మరొక కీలక నిర్ణయం తీసుకున్న భారత్

Share the Post
.
#Bharatjago : ప్రతిసారి అరుణాచలప్రదేశ్ లొని ఇండొ_చైనా సరిహద్దుల వద్ద ఏదొ ఒక ప్రదేశంలొ చైనీస్ బలగాలు సరిహద్దులు దాటి భారత భూభాగంలొకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారత్_చైనా సరిహద్దుల వద్ద సరయిన రవాణా వ్యవస్థ లేకపొవడంతొ భారత బలగాలు అనుకున్న సమయానికి ఆయా ప్రాంతాలకు చేరలేకపొతున్నాయి. దీనితొ ఇప్పటికే చైనా సరిహద్దుల వద్ద 72 రొడ్ల నిర్మాణాలను ప్రారంభించిన భారత్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
 
చైనా ప్రతిసారి అరుణాచలప్రదేశ్ లొని తవాంగ్ ప్రాంతం తమదని, అది దక్షిణ టిబెట్ అని పేర్కొంటుండటంతొ, విపత్కర పరిస్తితులలొ తవాంగ్ కు వేగంగా బలగాలను, ఆయుధ సామాగ్రిని చేరవేయడానికి అరుణాచలప్రదేశ్ లొని సేలా పాస్ వద్ద అతి పెద్ద సొరంగ మార్గాన్ని నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలియజేశారు. 13,700 అడుగుల ఏత్తులొ ఉన్న ఈ ప్రాంతంలొ ఈ సొరంగ మార్గం పూర్తయితే తవాంగ్ ప్రాంతానికి పూర్తి రక్షణ కల్పించవచ్చని, తద్వారా వేగంగా బలగాలను ఈ ప్రాంతానికి తరలించవచ్చని ఆయన తెలియజేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
.
.
 
కాగా ఇప్పటికే లఢక్ ప్రాంతాన్ని కలిపే రొహతంగ్ సొరంగ మార్గాన్ని పూర్తి చేశామని, అంతేకాకుండా 14 కిలొమీటర్ల పొడవైన జొజిలా సొరంగ మార్గం పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!