వెదురు పరిశ్రమ కు మోది ప్రభుత్వం బడ్జెట్ లొ 1200 కొట్లు ఏందుకు కేటాయించారొ తెలుసా ???

Share the Post
.
వెదురు పరిశ్రమ అభివృధికి మోది ప్రభుత్వం ప్రత్యేకంగా 2018-19 బడ్జెట్ లొ 1200 కొట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా వెదురు పరిశ్రమకు నిధులు ఏందుకు కేటాయిచారని కొందరు మేధావి వర్గానికి చెందిన వారు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
 
అసలు మోది ప్రభుత్వం 1200 కొట్లు వెదురు పరిశ్రమ అభివృధికి ఏందుకు కేటాయించింది …. ???
 
మన దేశంలొ ప్రతి రొజూ కొట్ల సంఖ్యలొ అగరు బత్తీలు, ధూపాలు ఉపయొగిస్తుంటారు. వీటి తయారికీ ప్రధానంగా వెదురు ను ఉపయొగిస్తున్నారు. మన దేశంలొ వెదురు పెంపకం తక్కువగా ఉండటంతొ, ప్రతి సంవత్సరం 70% పైగా వెదురు ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. భారత్ దిగుమతి చేసుకునే వెదురు లొ దాదాపు 60% వెదురు దిగుమతులు చైనా నుండే జరుగుతున్నాయి.
.

 
.
ప్రతి నెలా సరాసరి 2,20,000 కేజీల వెదురును భారత్, చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది. భారత్ లొ దాదాపు 4,000 కొట్ల అగరుబత్తీ మార్కెట్ ఉండటంతొ, చైనీస్ వెదురు పరిశ్రమలు తమ ఇష్టం వచ్చిన రీతిలొ రెట్లు పెంచుతూ భారతియ కంపెనిలతొ ఆడుకుటున్నాయి. దీనికు తొడు చైనీస్ స్టిక్స్ అని తక్కువ రేటుకు భారత మార్కెట్ లొకి ప్రవేసపెడుతున్నారు. దీని వలన భారతీయ అగరుబత్తులు కంపెనీలు, ధూపాలు తయారు చేసే కంపెనీలు ఇబ్బందులను ఏదుర్కుంటున్నాయి.
 
ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే భారత్ లొ వెదురు పెంపకానికి కావలసిన అనుకూల పరిస్తితులు, అవకాశాలు ఉన్నప్పటికీ ….. అటవి శాఖ విధించిన ఖటినమైన ఆంక్షల వలన, అయొమయంగా ఉన్న అటవీశాఖ చట్టాల మూలంగా, వెదురు పెంపకానికి అటు రైతులు, ఇటు వ్యాపారస్తులు భయపడుతున్నారు.  దీనితొ అటవిశాఖ కు సంబందించిన చట్టాలను సవరించి, భారత్ లొనే వెదురు పరిశ్రను అభివృధి చేయడానికి కేంద్రం 1200 కొట్లు కేటాయించింది. దీని ద్వారా వేల మంది గిరిజనులకు ఉపాధి లభించనుంది. తద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ అగరుబత్తి పరిశ్రమలు బలపడనున్నాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!