మొదటిసారి మోది విదేశాంగ విధానం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన చైనీస్ Top Expert

Share the Post

#Bharatjago : చైనా విదేశీ సలహాదారు,  చైనీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్  (CIIS) ఉపాద్యక్షుడయిన “రాంగ్‌ యింగ్‌”, మోది విదేశాంగ విధానం గురించి లొతుగా విశ్లేషించి,  స్పష్టమైన నివేదికను తయారు చేశారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మోది నాయకత్వంలొ భారతదేశ విదేశాంగ విధానం ఉత్సాహంగా, దృడంగా ముందుకు దూసుకు పొతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకొసం మోది విలక్షణమైన, అసమానమైన విధానాన్ని అనుసరిస్తూ భారత్ ను సూపర్ ఫవర్ చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మోది అనుసరిస్తున్న ఈ విధానాన్ని “Modi Doctrine” అని రాంగ్‌ యింగ్‌ సంబొధించారు. ముఖ్యంగా చైనా ను కంట్రొల్ చేయడానికి, మోది జపాన్_అమెరికా దేశాలతొ అత్యంత సన్నిహిత సంబందాలు నెరుపుతూ పరస్పర ప్రయోజనాలు పొందడంలొ సఫలీకృతుడవుతున్నారని తెలియజేశారు.మోదీ హయాంలో చైనా, భారత్‌ మధ్య సంబంధాలు స్థిరంగానే ఉన్నాయని, అయితే రెండు దేశాలు ఒక అవగాహనకు రావలసిన అవసరం ఉందని ఆయన సలహా ఇచ్చారు.

.

.

ముఖ్యంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి మోది ఏమాత్రం వెనుకంజ వేయడం లేదని పేర్కొన్నారు. సరిహద్దులు దాటి పాకిస్థాన్ పై దాడులు చేయడం, ధొక్లాం లొ చైనా ను నిలువరించడం, నొట్లరద్దు, GST వంటి విషయాలలొ మోది సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడని ఆయన ప్రశంసించారు. మోది నేతృత్వంలొ భారత్, మొదటిసారి చైనాతొ అన్ని విషయాలలొ పొటీ పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వాధినేతలతో పోలిస్తే దక్షిణాసియా దేశాల్లో భారత్ విదేశాంగ విధానం అద్భుత ఫలితాలనిస్తుందని, ముఖ్యంగా మోది భూటాన్, నేపాల్ వంటి చిన్న చిన్న దేశాలకు కూడా అధిక ప్రాధాన్యత నిస్తుడటం చెప్పుకొతగ్గ విషయం గా ఆయన తెలియజేశారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!