జయహొ భారత్ : వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు “జై” కొట్టిన కేంద్ర బడ్జెట్‌

Share the Post
#Bharatjago : వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ జైట్లీ ఈ బడ్జెట్‌ లొ అధిక ప్రాధానత నిచ్చారు. వ్యవసాయ రుణాలను ఇప్పుడు మరొక లక్ష కొట్లు పెంచి వ్యవసాయ ఋణాలకు 11 లక్షల కొట్లు కేటాయించారు. రైతుల ఉత్పాదకతను పెంచే చర్యలు చేపడుతు, రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచాలన్నది ఈ ఏడాది అతిపెద్ద నిర్ణయం. ఈ రబీ పంటల నుంచే కనీస మద్దతు ధర.. ఉత్పాదన వ్యయానికంటే ఒకటిన్నర రెట్లు (150శాతం ఎక్కువ) ఉండాలని నిర్ణయించింది.
 
తరువాత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పెద్ద పీట వేశారు. ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్లను అనుసంధానం చేసి 2022 నాటికి అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణం చేయడమే లక్ష్యంగా పెద్ద ఏత్తున నిధులు కేటాయించారు. అలాగే గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713 కోట్లు, గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2 వేల కోట్లు కేటాయించడం విశేషం. గ్రామాల్లో 5లక్షల వైఫై రూటర్ల సదుపాయం కల్పించనున్నారు.
 
తరువాత విద్య, వైద్యం, మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా చేయనున్నారు. ఉజ్వల యోజనలో భాగంగా 8 కోట్లమంది గ్రామీణ మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు అందివ్వనున్నారు. నిరుద్యొగులకు ముద్రయోజన ద్వారా ఇచ్చే ఋణాలను మూడు లక్షల కొట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం, వాటిలొ 75% మహిళలకే కేటాయించాని నిర్ణయం తీసుకొవడం విశేషం. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు కేటాయించడం విశేషం.
 
అలాగే విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు కేటాయించి, విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!