3 సంవత్సరాల 8 నెలల మోది ప్రభుత్వం, అభివృద్దిలో భళా అనక తప్పదు.

Share the Post

#Bharatjago : ఇప్పటి వరకు ఎందరో ప్రధానులను చూసాం కాని ఇప్పటి ప్రధాని మాత్రం తనకు తాను ప్రధాన సేవకుడిగా ప్రకటించుకున్నారు. ఆ పదానికి ప్రతినిర్వచనంగా పని చేయడం ఆయన లక్షణం.రోజుకు 18 గంటలు పని చేయటం ఆయన ప్రత్యేకత, భారాతావని అభివృద్దికోసం నిరంతర శ్రామికుడై పనిచేస్తున్నాడు.ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి 16 సంవత్సరాల నుంచి ఒక్క సెలవు తీసుకోకుండా దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించారు.తన శరీరంలో ప్రతి కణం, జీవితంలో ప్రతి క్షణం ఈ దేశం కోసమే అని చెప్పకనే చెప్పారు.ఎటువంటి బందు ప్రీతి మరియు తన కుంటుంబాన్ని ప్రదాని నివాసానికి కూడ దూరంగా ఉంచుతారు. తన తల్లి ఒక్కసారి మాత్రమే ప్రధాని నివాసానికి వచ్చింది అది కూడ తన వైద్య పరీక్షలకు.

ప్రధానంగా మద్యతరగతి, పేద వారి కొసం మోది ప్రభుత్వం ఏమి చేస్తుందొ చూడండి

ప్రధాన మంత్రి జన్ ఔషది యోజన ద్వారా సుమారు 800 రకాల మందులను అతితక్కువ ధరకు అందిస్తున్నారు, ఇలాంటి కేంద్రాలు దేశంలో 3 వేలకు పైగా ఉన్నాయి.

3.50లక్షలకు పైగా అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు.

స్టంట్ల ధరలను తగ్గించి, దాదాపు 500 జిల్లాల్లో డయాలసీస్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు

2022లోగా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయి

ఆధార్‌ వల్ల రూ.57 వేల కోట్లను మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడారు (అందుకే కొన్ని రాస్ట్ర ప్రభుత్వాలు మోది గారిపై అక్కసు వెళ్లగక్కుతున్నాయి)

ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా సుమారు రూ4 లక్షల కోట్ల రుణాలను అందించారు, 10 కోట్ల మంది లబ్దిదారులు. ఇందులో 3 కోట్ల మంది మొదటిసారిగా లబ్ది పొందిన వారు ఉన్నారు.

కనీస వేతనం ను 40% పెంచిన మోదీ ప్రభుత్వం,దీన్ దయాల్ అమృత్ యోజన క్రింద 5200 బ్రాండెడ్ మందులను, 111 కేంద్రాల ద్వారా 60% నుంచి 90% తక్కువ దరలకు అమ్ముతున్నారు.

ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా దేశంలోని 82% గ్రామాలను రోడ్ల నిర్మాణం ద్వారా అనుసందానం చేయటం జరిగింది. 2014 లో కేవలం 56% గ్రామాలు మాత్రమే అనుసందానంలో ఉన్నాయి.

31 కోట్ల ఎకౌంట్స్ ను జన్ ధన్ యోజన క్రింద తెరవటం జరిగింది

బెటీ బచావో బెటీ పడావో పధకం సానుకూలత వల్ల 161 జిల్లాల నుండి 640 జిల్లాలకు విస్తరించడం జరిగింది.ఆడ పిల్లలపై వివక్షను రూపుమాపడానికి ఈ పధకం ప్రవేశ పెట్టారు.

ప్రసూతి బెనిఫిట్ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ఈ కొత్త చట్టం ద్వారా 26 వారాల జీతంతో కూడిన సెలవును కల్పించింది ఇప్పుడు పనిచేస్తున్న మహిళలు వారి శిశువులను జాగ్రత్తగా చూసుకోవడానికి మరింత సమయం కలుగుతుంది.

దేశం మొత్తంలో 2 లక్షల 70 వేల కామన్ సర్వీస్ సెంటర్లు ఎర్పాటుచేయబడ్డాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలలో డిజిటల్ సేవలను తక్కువ ధరలలో అందుబాటులోకి తెచ్చారు.

5 కోట్ల 71 లక్షల మంది రైతులుకు ఫసల్ భీమా యోజన ద్వారా పంట రక్షణ కల్పించారు. 2.5 లక్షల పంచాయితీలు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ ద్వారా అనుసందానం చెయ్యబడ్డాయి.

గత మూడేళ్లలో 93 లక్షల ఇళ్ళు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించారు.

One Rank One Pension ద్వార 20 లక్షల సైనికులకు 10 వేల కోట్లను ఇచ్చారు.

Good luck పధకం క్రింద 4 కోట్ల నిరుపేదలకు విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వటం జరిగింది. 

 

 
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!