చైనా కు ధీటుగా భారత అమ్ముల పొదిలొ చేరనున్న మరొక బ్రహ్మాస్త్రం “INS కరంజ్”
#Bharatjago : స్వదేశీయంగా, ముంబాయి లొని మజగావ్ డాక్ లొ నిర్మించిన స్కార్పియన్ సబ్మెరైన్ INS కరంజ్, ఈ రొజు అధికారికంగా జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు-75 లొ భాగంగా మజగావ్ డాక్ లొ నిర్మిస్తున్న మొత్తం ఆరు స్కార్పియన్ సబ్మెరైన్లలొ ఐఎన్ఎస్ కరంజ్ మూడవది. ఇండియన్ నేవీ చీఫ్ “సునీల్ లాంబా” సతీమణి రీనా లాంబా ఆధ్వర్యంలొ INS కరంజ్ ను జలప్రవేశం చేశారు.
కాగా ఈ స్కార్పియన్ సబెరైన్ కు అనేక ప్రత్యేకతలున్నాయి. ఇది Stealth features కలిగి ఉన్న డీజిల్-ఏలక్ట్రికల్-స్కార్పియన్ సబ్మెరైన్. అంటే ఇది అతి తక్కువ శబ్ధంతొ, రహస్యంగా శత్రుస్థావరాలలొకి ప్రవేశించగల సామర్ధ్యం దీని సొంతం. అంతేకాకుండా దీని కున్న వజ్ర శరీరం వలన ఇది తేలికగా నీటిలొ కలిసిపొవడం దీనికున్న మరొక ప్రత్యేకత. దీని కున్న Stealth features వలన ఇది శత్రువుల సొనార్లకు చిక్కకుండా , 1150 అడుగుల లొతులొ ప్రయాణిస్తూ శత్రుస్థావరాల మీద గల దాడి చేయగల సత్తా దీని సొంతం.
.
.
ఏటువంటి సవాళ్లనైనా ఏదుర్కొనే విధంగా ఈ సబ్మెరైన్ తయారుచేయబడింది. థొర్పెడొలను, యాంటి సబ్మెరైన్ మిసైల్స్ ను నీటి ఉపరితలం పైనుండి, నీటి లొపల నుండి ప్రయోగించగలదు. అంతేకాకుండా గూఢచర్యం చేయడానికి, శత్రు నౌకలపై డేగకన్ను వేయడానికి ఈ సబ్మెరైన్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఈ వరుసలొ మొదటి స్కార్పియన్ సబ్మెరైన్ అయిన INS కల్వరి ని ఇప్పటికే నేవిలొకి ప్రవేశపెట్టగా, రెండవ స్కార్పియన్ సబ్మెరైన్ అయిన INS ఖండేరీ ప్రస్తుతం Sea trails లొ ఉంది. మూడవదైన INS కరంజ్ ఈ రొజు జల ప్రవేశం చేసింది. వీటి చేరిక ద్వారా చైనాకు ధీటుగా భారత నేవీ శక్తివంతమవుతుంది.
.