Big Breaking News : సమాచారాన్ని దొంగిలిస్తూ “ఆఫ్రికన్ యూనియన్” లొ అడ్డంగా దొరికిపొయిన చైనా

Share the Post
#Bharatjago : ఆఫ్రికా,  చైనా కు గుండెకాయలాంటిది.  చైనా ఆర్ధిక వ్యవస్థ లొ ఆఫ్రికాది కీలకపాత్ర. ఆఫ్రికా నుండి విలువైన ఖనిజాలను గత రెండు దశాభ్దాలుగా చైనా కారుచౌకగా కొట్టేస్తుంది. ఇందుకొసం చైనా, ఆఫ్రికా లొ లక్షల కొట్లు పెట్టుబడులు పెట్టింది. అంతేకాకుండా ఆఫ్రికా మీద ఆధార పడి లక్షల మంది చైనీయులు బతుకుతున్నారు.
 
ఆఫ్రికాలొని 55 ఆఫ్రికన్ దేశాలకు ఒక యూనియన్ ఉంది. దాని పేరు ఆఫికన్ యూనియన్. దీనితొ ఆఫ్రికా దేశాలను మచ్చిక చేసుకొవడానికి ఆఫ్రికన్ యూనియన్ కొసం చైనా దాదాపు 1300 కొట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇధియోఫియా రాజధాని అడీస్ అబాబా లొ ఆఫ్రికన్ యూనియన్ సెంటర్ ను నిర్మించి, దానిని 2012 లొ ఆఫ్రికా దేశాలకు బహుమతిగా ఇచ్చింది.
 
అయితే అప్పటి నుండి అంటే గత ఐదు సంవత్సరాల నుండి ఆఫ్రికన్ యూనియన్ కు చెందిన రహస్య సమాచారాన్ని చైనా దొంగిలించడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ప్రాన్స్ కు చెందిన “లీ మోండే” అనే పత్రిక బయట పెట్టడంతొ బిత్తరపొయిన ఆఫ్రికన్ యూనియన్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ కేసును విచారించిన సాంకేతిక సబ్యుల బృందం సమాచారం దొంగిలించబడటం నిజమేనని, ఈ సమాచారమంతా షాంఘై లొని ఒక సర్వర్ రికార్డు చేస్తుందని రిపొర్టు ఇవ్వడంతొ ఒక్కసారిగా  పెను దుమారం చెలరేగింది. అంతేకాకుండా ఇక్కడ పెద్ద మొత్తంలొ మైక్రొ ఫొన్లు లభ్యమయ్యాయి.
 
దీనితొ చైనా సర్వర్లన్నింటినీ తక్షణమే తొలగించి, ఆఫ్రికన్ యూనియన్ కొత్త సర్వర్లను అమర్చుకున్నారు. చైనా సహాయం అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా రాయబారులను అంటరానివారుగా చూస్తున్న  ఆఫ్రికన్ దేశాలు ఈ విషయంపై వచ్చే ఆఫ్రికన్ యూనియన్  సమావేశాలలొ ఈ విషయంపై  నిర్ణయం తీసుకొనున్నట్టు తెలుస్తుంది.
 
కాగా చైనా దాదాపు 42 ఆఫ్రికన్ దేశాలను ఉద్యొగాలిప్పిస్థామని, ఆభివృధి చేస్థామని చెప్పి, ఆయా దేశాల చేత పెట్టుబడులు పెట్టించి రెండు సార్లు మోసం చేసింది. కాగా ఇది మూడవ అతి పెద్ద మోసం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!