చైనా పై మరొక Mind Game ప్రారంభించిన భారత్

Share the Post
#Bharatjago :  గత దశాబ్ధ కాలంలొ భారత్ ను ఒక ఆట ఆడించిన చైనాను, ఇప్పుడు భారత్ ఒక ఆట ఆడిస్తుంది. ఏప్పుడూ రెండు నాల్కల ధొరణి ప్రదర్శించే చైనాతొ ఏప్పటికయినా భారత్ కు ఇబ్బందేనని భావించిన మోది ప్రభుత్వం, భవిష్యత్తులొ భారత్ కు చైనా నుండి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది
 
అందులొ భాగంగానే చరిత్రలొ మొట్టమొదటిసారి, వియత్నాం తొ కలిసి Military Exercise ప్రారంభించింది. జబల్పూర్ లొ జరిగే ఈ Exercise ఆరు రొజులపాటు జరగనున్నాయి. ఈ Exercise పేరు ‘VINBAX . భారత్_వియత్నాం దేశాల మద్య Defence Cooperation ను మరింత శక్తివంతం చేసుకునేందుకు ఈ Military Exercise ను ప్రారంభించారు.
 
అయితే ఇందులొ ఏముంది అనుకుంటున్నారేమొ … ఇక్కడే ఉంది అసలు పన్నాగం.
1994 లొ అప్పటి ప్రధాని నరసింహారావు గారు ముందు చూపుతొ వియత్నాం తొ డిఫెన్స్ కోఅపరేషన్ ఓప్పందం చేసుకున్నారు. 2016 లొ మోది ప్రభుత్వం, ఈ ఓప్పందాన్ని Comprehensive strategic partnership స్థాయికి తీసుకువెళ్ళి, వియత్నాం తొ మరింత ప్యూహాత్మక రక్షన బందాన్ని పటిష్టం చేసింది ……  ప్రస్తుతం భారత్ లొ ప్రారంభమైన ఈ Military Exercise, వచ్చే సంవత్సరం వియత్నాం లొ జరుగుతాయి. అంటే చైనా పక్కనే చైనా శత్రువుతొ కలిసి మనం ఈ ఏక్సరసైజ్ చేస్థాం. తరువాత తరువాత రకరకాల కారణాలతొ, మెల్ల మెల్లగా వియత్నాంలొ పాతుకుపొవచ్చు …… అంటే పాకిస్థాన్ లొ, గ్వాదర్ పొర్టులొ చైనా ఏటువంటి వ్యూహాన్నయితే అనుసరిస్తుందొ, సరిగ్గా కాస్థ అటు ఇటుగా అటువంటి వ్యూహాన్నే భారత్ అమలు చేయనుంది.. విషానికి విషమే విరుగుడు అన్నట్టు, చైనా అతి తెలివితేటలను చైనాకే రుచిచూపించనున్నాము.
 
వియత్నాంలొ భారత్ ఆర్మీ ఉండటం అనేది చైనాకు పక్కలొ బల్లెం లాంటిది. దీని వలన భవిష్యత్తులొ చైనా ఏప్పుడైనా భారత్ పై దాడి చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలొచించుకొవాల్సిన అవసరం ఏర్పడుతుంది. పైగా భారత్ కు అండగా వియత్నాం నిలబడుతుంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!