అత్యంత అభివృధి చెందిన భారతీయ ద్వీపం “కుమారి కందం” ఏమయింది …. ???

Share the Post
#Bharatjago : కుమారి కందం : ఒకప్పటి ప్రాచీన భారత దేశంలొ భాగమైన ఈ ద్వీపం గురించి ఈ మద్య కాలంలొ “హిస్టరీ చానల్” ద్వారా మరల వెలుగులొకి వచ్చింది. దక్షిణ భారతం, ఆఫ్రికాలొని మడ్గాస్కర్, అస్ట్రేలియా ఖండాల మద్య విస్థరించి ఉన్న ఈ ద్వీపం, నాగరికతకు పుట్టినిల్లుగా చెబుతుంటారు. ముఖ్యంగా పాండ్యరాజులు ఈ ద్వీపాన్ని పరిపాలించినట్టు తెలుస్తుంది. దాదాపు 303 BEC నుండి 1650 CE మధ్య కాలంలొ పాండ్య రాజులు ఈ ద్వీపాన్ని పరిపాలించట్టు తెలుస్తుంది. దీనితొ ఆ కాలంలొ దీనిని పాండ్య నాడు అని పిలిచేవారట. అప్పటిలొనే ఇక్కడ గొప్ప నాగరికత అభివృధి చెందిందని, ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాలు ఉండేవట. 
 
మనకు చిన్న పిల్లల కధల పుస్థకాలలొ వ్రాయబడే జ్వాల ద్వీపం లాంటి కధలకు ఈ ద్వీపమే ప్రేరణగా ఉందని తెలుస్తుంది.
 
తరువాత ఈ కుమారి కందం ద్వీపం గురించి 13 వ శతాబ్ధంలొ స్కంద పురాణం లొ పేర్కొనబడింది. స్కంద పురాణం అనేది 18 హిందూ గ్రంధాలలొ ఒకటి. 81,000 వేల పద్యాలతొ లిఖించబడిన ఈ గ్రంధానికి, శివ పార్వతుల కుమారుడైనటువంటి సుబ్రమణ్యస్వామి (తమిళంలొ మురుగన్ అంటారు) పేరు మీద స్కంద పురాణం అని పేరు వచ్చింది. కాగా ఈ స్కంద పురాణంలొ ప్రపంచ పుట్టుక ఈ ద్వీపం నుండే జరిగిందని, ప్రపంచం మొత్తానికి ఈ ద్వీపమే  Kingdom అని,   ఈ ద్వీపం 49 భూభాగాలుగా విభజించబడిందని   స్కంద పురాణం లొ పేర్కొనబడి ఉంది. ఈ ద్వీపంలొ శివుని ఏక్కువగా ఆరాధించే వారని, వేదాలు ఇక్కడ వల్లించబడాయని ఈ గ్రంధం పేర్కొంది.
.
.
 
తరువాత కొంత మంది తమిళ రచయితలు వ్రాసిన గ్రంధాలలొ ఈ ద్వీపాన్ని  ఏక్కువగా మహిళా రాణులు పరిపాలించారని, మహిళలే తమ భర్తలను ఏంపిక చేసుకుని, వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే వారని అందుకే ఈ ద్వీపానికి కుమారి కందం అని పేరు వచ్చిందని పేర్కొన్నారు.
 
కాగా 16,000 BEC  లొ జరిగిన ఖండాల కదలిక వలన (Continental drift ), టెక్టానిక్ పేట్ల కదలిక వలన ఈ ద్వీపం పూర్తిగా హిందూ మహా సముద్రం లొపలికి చొచ్చుకు పొయిందని, మారిషస్ భూభాగం కూడ ఈ ద్వీపంలొని భాగమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాగా 1999 లొ  Jodies  research vessel హిందూసముద్రంలొ డ్రిల్లింగ్ చేస్తుండగా మునిగి పొయిన ఈ ద్వీపానికి సంబందించిన ఆనవాళ్ళు దొరికాయని తెలుస్తుంది.
 
కాగా 19 వ శతాబ్దంలొ అమెరికా, యూరొపియన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మునిగి పొయిన ఈ ద్వీపంపై పరిశొధనలు జరిపి ఈ ద్వీపానికి లిమూరియా అని పేరు పెట్టారు. ఈ లిమూరియా ద్వీపం గురించి 1880 నుండి అనేక పుస్థకాలు వ్రాయబడ్డాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!