రిపబ్లిక్ డే సంధర్బంగా, అందరినీ ఆకట్టుకున్న రష్యన్ అధ్యక్షుడు “పుతిన్” వ్రాసిన లేఖ

Share the Post

#Bharatjago : భారత 69 వ గణతంత్ర్య దినొత్సవం సంధర్బంగా ప్రపంచంలొని అనేక దేశాల నుండి ఆయా దేశాధినేతలు గ్రీటింగ్స్ పంపించారు. అలాగే రష్యన్ అధ్యక్షుడు కూడా భారత ప్రధాని నరేంద్రమోది కి లేఖ వ్రాసారు. అనేక దేశాల నుండి గ్రీటింగ్స్ వచ్చినప్పటికీ, అన్నింటిలొను రష్యన్ అధ్యక్షుడు పుతిన్ పంపిన లేఖ అందరినీ ఆకట్టుకుంది.

దయచేసి మనస్పూర్తిగా నేను పంపిస్తున్న శుభాకాంక్షలను స్వీకరించండి ( Kindly accept  my cordial greetings on the national day)  అంటూ మొదలు పెట్టిన పుతిన్ “ఆర్ధికంగా, సామాజికంగా, సాంకేతికంగా, టెక్నాలజీ పరంగా మీ దేశం ఏంత అభివృధి చెందిందొ మాకు బాగా తెలుసు, ముఖ్యంగా ప్రపంచం స్థిరత్వం సంపాదించడంలొ, రక్షణ విషయంలొ భారత్ అద్భుతమైన పాత్ర పొషించింది. అలాగే ప్రపంచ ఏజెండాను ముందుకు తీసుకు వెళ్ళడంలొ, ప్రాంతీయ సమస్యలను పరిస్కరించడంలొ భారత్ చాతుర్యం అనిర్వచనీయం.

భారత్ తొ ప్యూహాత్మకమైన, ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని రష్యా ఏప్పటికీ విలువైనది గానే పరిగణిస్తుంది. మన ఇరు దేశాలు కలిసి చేస్తున్న ప్రయత్నాలు వ్యక్తిగతంగా నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ప్రపంచ రాజకీయాలలొ మన ఇరు దేశాలు కలిసి మరింత మెరుగైన పాత్ర పొషిస్థాయని, నిర్మాణాత్మకమైన పాత్ర పొషిస్థాయని నర్మగర్బంగా చెబుతున్నాను. ఈ విషయంలొ రెండు దేశాల ప్రజలు ఏంతొ ఏంతొ ఆసక్తిగా ఉన్నారని సందేహం లేకుండా చెప్పగలను. మీదేశ ప్రజలందరూ సుఖ సంతొషాలతొ ఉండాలని కొరుకుంటున్నాను” అంటూ రష్యన్ అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోది గారికి వ్రాసిన లేఖ అందరినీ ఆకట్టుకుంది.

కాగా ఈ సంవత్సరంలొ భారత ప్రధాని నరేంద్ర మోది, రష్యన్ అధ్యక్షుడు పుతిన్ మరొకసారి సమావేశమయ్యే అవకాశం ఉంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!