నిజాయితీకి గుర్తింపు : ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కు రాస్ట్రపతి అవార్డు

Share the Post

#Bharatjago : ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిజాయితీగా పనిచేస్తూ, అనేక ఇబ్బందులను ఏదుర్కొన్న ఇంటెలిజెన్స్ ఆఫిసర్ రాజీవ్ దత్ శంకర్ కు కేంద్ర ప్రభుత్వం రాస్ట్రపతి అవార్డు ప్రకటించింది. 1992 నుండి డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఏక్సైజ్ ఇంటెలిజెన్స్ లొ ఇంటెలిజెన్స్ అధికారిగా పని చేస్తున్న రాజీవ్ దత్త్ శంకర్ నిజాయితీకి మారుపేరు. ముఖ్యంగా పన్ను ఏగవేత దారులకు ఈయన సింహ స్వప్నం అని చెప్పవచ్చు. అందుకే రాజీవ్ దత్ శంకర్ గారు జీవితంలొ అనేక ఇబ్బందులను, అవమానాలను ఏదుర్కొవాల్సి వచ్చింది.

ఏటువంటి టాస్క్ నిచ్చినా వెనకడుగు వేయకుండా తీసుకునే రాజీవ్ దత్తా, 47 ముఖ్యమైన పన్ను ఏగవేత దారుల కేసులలొ 962 కొట్ల రూపాయల సంపదను గుర్తించి కేంద్రానికి అప్పగించారు. ముఖ్యంగా 541,61 కొట్ల రూపాయలకు సంబందించిన కీలకమైన కేసులొ, రాజకీయ పార్టీలకు చెందిన 277 కొట్ల రూపాయలను కనిపెట్టి వాటి మొత్తాన్ని జమ చేసారు. పన్ను ఏగవేత దారుల ఆస్తులను కనిపెట్టడంలొ రాజీవ్ దత్ గొప్ప చతురతను, సూక్షబుద్ధి ని ఉపయొగిస్థారని తెలుస్తుంది.

కాగా గత 25 సంవత్సరాల నుండి రాజీవ్ దత్ శంకర్, నిజాయితీగా ప్రాణాలను ఫణంగా పెట్టి చేస్తున్న సేవలను గుర్తించి మోది ప్రభుత్వం, దత్త్ గారికి రాస్ట్రపతి అవార్డును ప్రకటించడం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!