చందన్ గుప్తా హత్య కేసులొ ఒక్కొక్కటిగా వెలుగులొకి వస్తున్న నిజాలు

Share the Post
#Bharatjago : భారతదేశ గణతంత్ర దినొత్సవం సంధర్భంగా ఉత్తరప్రదేశ్ లొని కసగంజ్ పట్టణంలొ తిరంగా యాత్ర నిర్వహిస్తున్న చందను గుప్తా ను వేరే కమ్యునిటీ అధిపత్యంలొ ఉండే హల్కా ప్రాంతంలొ కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
 
ఇప్పుడు పొలీసు ఇన్వెస్టిగేషన్ లొ నిజాలు బయటకు వస్తున్నాయి. చందను గుప్తా ను షూట్ చేసిన బుల్లెట్, ఒక ముస్లిం కుటుంబం నివసించే ఇంటి పై నుండి వచ్చిందని #డిస్ట్రిక్_మెజిస్ట్రేట్  RP. సింగ్ తెలియజేశారు. ఇందులొ కీలక నిందితుడుగా సలీం అనే వ్యక్తిని   గుర్తించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం సలీం పరారీలొ ఉన్నాడని, పొలీసులు అతని కొసం గాలిస్తున్నారని ఆయన తెలియజేశారు.
 
కాగా ఈ హత్య కేసులొ పొలీసులు అరెస్టు చేసిన మరొక కీలక నిందితుడు వాసిం ఇంటిని సొదా చేయగా బిత్తరపొవడం పొలీసుల వంతయింది. వాసిం ఇంట్లొ ఏకంగా ఒక బాంబుల ఫ్యాక్టరీనే ఉన్నట్టు పొలీసులు కనుగొన్నారు. తయారు చేసిన బాంబులు, బాంబులు తయారు చేయడానికి కావలసిన మందు గుండుతొ సహా ఒక పిస్టల్ కూడా లభించినట్టు పొలీసు వర్గాలు తెలియజేశాయి.
 
కాగా ఈ కేసులొ ఇప్పటి వరకు 112 మందిని అరెస్టు చేయగా, అందులొ ఏకంగా 31 మంది మీద హత్యా నేరం అభియోగాలు మోపడం విశేషం.  అనుమానితులను ఏ ఒక్కరినీ వదలకుండా అరెస్టు చేస్తున్నట్టు తెలుస్తుంది
 
చందన్ గుప్తా హత్య ఏందుకు జరిగింది. అసలు ఏమయింది
 
చందన్ గుప్తా తల్లి, అతని స్నేహితులు చెబుతున్న దాని ప్రకారం …. రిపబ్లిక్ డే రొజున చందన్ గుప్తా, మరి కొంత మంది యువకులు జాతీయ జెండాతొ కసగంజ్ పట్టణమంతా తిరంగా యాత్ర జరుపుతుండగా, వేరే కమ్యునిటీ ఆధిపత్యంలొ ఉండే హల్కా ప్రాంతంలొ 200-300 మంది అల్లరి మూకలు హాకి స్టిక్కులు, గుళక రాళ్లతొ “పాకిస్థాన్ జిందాబాద్” అంటూ ఒక్కసారిగా చందన్ గుప్తా యాత్రపై దాడి చేసి, చందన్ గుప్తాను కూడ పాకిస్థాన్ జిందాబాద్ స్లొగన్లు ఇవ్వమని బలవంతం చేసినట్టు తెలిపారు.
 
అయితే చందన్ గుప్తా అందుకు ససేమిరా అంటూ .. వందేమాతరం, భారతమాత కీ అంటూ నినాదాలివ్వడంతొ చందన్ గుప్తాను కాల్చి చంపారని అతని తల్లి సంగీత గుప్తా స్పష్టం చేశారు.
.
.
కాగా ఈ హల్కా ప్రాంతం అసాంఘీక కార్యకలాపాలకు, మత హింస కు బాగా పేరొందిన ప్రాంతం. ఈ ప్రాంతంలొ యువకులకు అనేక రాడికల్ సంస్థలతొ సంబందాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపైనా పొలీసులు విచారణ ప్రారంభించారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!