గౌరీ లంకేష్ హత్య విషయంలొ కర్ణాటక సియం సిద్దారామయ్య కు దిమ్మతిరిగే స్ట్రొక్ ఇచ్చిన లంకేష్ సొదరుడు

Share the Post

#Bharatjago : గౌరి లంకేష్, బహుశా చాలా మంది మర్చిపొయి ఉండొచ్చు. కర్ణాటకలొని ప్రముఖ వామపక్ష రచయిన అయిన గౌరి లంకేష్ 2017 సెప్టెంబరు 4 సాయంత్రం హత్యకు గురయిన సంగతి తెలిసిందే. లంకేష్ హత్యకు గురయిన మరుక్షణమే కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీలతొ సహా మరొ కొన్ని ప్రాంతీయ పార్టీలు, మీడియా అందరూకలిసి  ఒకటిగా  ఈ హత్య చేసింది BJP,RSS లేనని అభాడం వేశారు. హిందూత్వానికి వ్యతిరేకంగా గౌరి లంకేష్ ప్రచారం పనిచేస్తుండటంతొ లంకెష్ ను  BJP,RSS లే చంపాయని పెద్ద ఏత్తున దేశ వ్యాప్తంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

అయితే గౌరి లంకేష్ హత్య జరిగి ఐదు నెలలు దాటినా ఇంత వరకు దొషులెవరినీ పట్టుకొకపొగా, కనీసం అనుమానితులను కూడా అరెస్టు చేయలేదు. మరి కొద్ది రొజులలొ కర్ణాటక ఏలక్షన్లు ఉండగా గౌరి లంకేష్ అంశాన్ని వాడుకుందామని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ …..

…… ఈ రొజు గౌరి లంకేష్ జయంతి సంధర్బంగా జనవరి 29 రొజును Gauri Day  (గౌరి డే) గా మారుస్తూ, బెంగుళూరు మద్యనున్న టౌన్ హాల్ లొ ఘనంగా “గౌరి డే” ను నిర్వహించారు.

ముఖ్య అతిధులు : ఈ గౌరి డే కు జిగ్నేష్ మేవావి, కణ్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్, షీలా రషీద్, రొహిత్ వేముల తల్లి రాధిక వేముల, ప్రకాశ్ రాజ్ లు ముఖ్య అతిధులుగా ఆహ్వానింపబడ్దారు.
అయితే ఇక్కడ ఆశ్చ్యర్యకరమైన విషయం ఏమిటంటే దేశంలొని ఎక్కడెక్కడి వాళ్లనొ ఆహ్వానించిన సిద్దరామయ్య ప్రభుత్వం, గౌరి లంకేష్ కుటుంబానికి సంబందించిన ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు.

 

దీనితొ ఈ విషయం పై స్పందించిన గౌరి లంకేష్ సొదరుడు ఇంద్రజిత్ లంకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ “బహూశా సిద్దారామయ్య ప్రభుత్వం గౌరి లంకేష్ ను చంపిన వారిని పట్టుకొకుండా ఇలా లంకేష్ పేరు వాడుకుంటూ ఏన్నికలలొ లభ్ది పొందాలని చూస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మనసుతొ చేసింది కాదని ఇది పూర్తిగా సిద్ధా రామయ్య రాజకీయ స్పాన్సర్డ్ కార్యక్రమమని, ఈ ఆలొచన నిచ్చింది సిద్ద రామయ్య ఆంతరంగికుడయిన దినేష్ అమిన్మత్తు అని కొత్త విషయాలు బయట పెట్టాడు.

.

 

ఏక్కడొ ఉన్న జిగ్నేష్ మేనావి, కణ్హయ్య కుమార్ లకు విమానం టికెట్టు ఖర్చులు పెట్టుకుని మరీ ఇక్కడకు రప్పించారని, అసలు అంత అవసరమేమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం గౌరి లంకేష్ పెరు చెప్పుకుని వచ్చే ఏన్నికలలొ లభ్ది పొందడం కొసమే ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని తేల్చి చెప్పారు. విచారణ కమిటీ ఏమైందొ ఏవరికీ తెలియదని, గౌరి లంకేష్ అనే ఓడపై ప్రయాణం చేసి సిద్దారామయ్య ఏన్నికలలొ తీరాన్ని చేరాలనుకుంటున్నాడని” అంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య పై గౌరి లంకెష్ సొదరుడు ఇంద్రజిత్ లంకేష్ విరుచుకు పడ్డారు.

కాగా ఇంద్రజిత్ లంకేష్ వ్యాఖ్యలతొ, బయటపెట్టిన విషయాలతొ కార్ణాటకలొని కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలొ పడ్డ ఏలుకలా తయారయింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!