విడిపొనున్న బిజెపి_టిడిపి మిత్రపక్షాలు ????

Share the Post

#Bharatjago : కేంద్ర ప్రభుత్వం పై సుప్రీం కొర్టుకు వెళతామని చంద్రబాబు నాయుడు మాట్లాడటం, నిన్న మరలా మిత్రపక్షం బీజేపీతో పొత్తుకు నమస్కారం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతో బిజెపి, టిడిపి పార్టీల మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు మండిపడుతున్నారు .

మిత్ర ధర్మం పై మీరా మాట్లాడేది అంటూ, ప్రముఖ బిజెపి నాయకులు సొము వీర్రాజు గారు తీవ్రస్థాయిలొ విరుచుకు పడ్డారు. ఒక పక్క తమ నేతలతొ బిజెపి ని తిట్టిస్తూ, తిరిగి మాపై అబాండాలు మోపడమేందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్ట్రంలొ అమలవుతున్న 24 గంటల విద్యుత్తు, స్వచ్చ సర్వేక్షణ్, చంద్రన్న భీమా పధకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ కనీసం మోది గారి పొటొ ను కూడా పెట్టడం లేదని, చివరకు మంత్రి మాణిక్యాలరావు గారితొ సహా బిజెపి శేణులకు ఉదేశ్యపూర్వకంగానే అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి 42,000 కొట్ల చొప్పున ఇప్పటికి వరకు రాస్ట్రానికి 1.26 లక్షల కొట్ల రూపాయల నిధులు ఇచ్చినప్పటికీ ఆ విషయాలను ప్రజలకు తెలియనివ్వకుందా తప్పుదొవ పట్టిస్తున్నారని, పొలవరం ప్రాజెక్టుకు 4,000 కొట్లు ఇస్తే కేవలం 100 కొట్లు మాత్రమే ఇచ్చారని ప్రచారం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపుల్ తలాక్ విషయంలొ లొక్ సభలొ సపొర్టు చేసి, రాజ్యసభలొ వ్యతిరేకించడం మిత్రధర్మమా అంటూ విరుచుకు పడ్డారు.

ఈ విషయం పై బిజెపి నాయకురాలైన పురంధరేశ్వరి గారు స్పందిస్తూ కేంద్రప్రభుత్వం వేల కొట్ల నిధులు ఇస్తున్నప్పటికీ, ఏమీ చేయడం లేదని ప్రచారం చేయడమెంటని, ఇక్కడ జరుగుతున్న విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని స్పష్టం చేసారు. అలాగే బిజెపి శాసనసభాపక్ష నాయకుదైన విష్ను కుమార్ రాజు స్పందిస్తూ “ఒక పార్టిలూ గెలిచిన MLA లను, తమ పార్టీలొకి లాక్కుని మంత్రి పదవులివ్వడం నైతికత ఏలా అవుతుందని, పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేసారు.  కాగా జిల్లా సమీక్షా మండలి సమావేశానికి బీజేపీ మంత్రి వర్యులు పైడికొండల మాణిక్యాలరావు గైర్హాజరు అవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

కాగా ఈ మద్య కాలంలొ టిడిపి నేతలు బిజెపి గురించి మాట్లాడుతూ బిజెపి ఐస్ క్రీ పుల్లలాంటిదని, బిజెపి తొ పొత్తు లేకుంటే టిడిపి మెజారిటీ పెరిగేదని, అభివృధిని బిజెపి అడ్డుకుంటుందని మాట్లాడిన మాటలపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహంతొ ఉన్నారు.  ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంకా టిడిపి తొ పొత్తు కొనసాగించడం అవసరమా అని సీరియస్ గా ఆలొచిస్తున్నట్టు తెలుస్తుంది.   ఈసారి స్వతంత్రంగా పొటీ చేస్తే ఏవరి బలమెంతొ అందరికీ తెలిసి వస్తుందన్న ఆలొచనలొ ఉన్నట్టు సమాచారం. సీట్లు వచ్చినా రాకున్నా ఇకనుండైన బిజెపి స్వతంత్రంగా బలపడ వచ్చునన్నది మెజారిటీ బిజెపి నాయకుల అభిప్రాయంగా తెలుస్తుంది. కాగా ఈ విషయంపై  బిజెపి అధిష్టానం త్వరలొ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

.

2 thoughts on “విడిపొనున్న బిజెపి_టిడిపి మిత్రపక్షాలు ????

  • January 28, 2018 at 5:32 pm
    Permalink

    ఒంటరిగా వెళ్ళడమే మంచిది .

    Reply
  • January 29, 2018 at 4:04 am
    Permalink

    ఇలాంటి బండ బతుకు బిజెపి కి అవసరమా .టిడిపి నాయకులు ఏం మిత్రధర్మం పాటిస్తున్నారు అని వాళ్ళ జతతో జతకట్టడం.
    విడిపోయి ఓడిపోయిన ఇటువంటి మిత్రపక్షం అవసరం లేదు. తాడోపేడో తేల్చేస్తే మంచిది.
    కార్యకర్తలు ఇదంతా చూసి విసిగిపోయి బయటకు పోకుండా చూడండి.
    భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳
    జై బిజీగా. జై మోదీజీ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!