కారు మబ్బుల వెనుక కానరాని భాస్కరుడు : తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

Share the Post

#Bharatjago : 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అప్పటిలొ రాయల వారి కాలం నాటి నుండి రాయలసీమలొ గ్రామాలు పాలెగాండ్ల (జమిందారులు) పరిపాలనలొ ఉండేవి. నరసింహారెడ్డి తండ్రి జయరామి రెడ్డి ఉయ్యాలవాడ పాలెగాడు (జమిందారు) గా ఉండేవారు. ఉయ్యాలవాడలొ ఉన్న ఆయన కొట పేరు నొస్సాం కొట.

అయితే బ్రిటీషు వారు నిజాం నవాబు సాయంతొ ఉయ్యాలవాడ తొ సహా కర్నూలు, కడప జిల్లాను ఆక్రమంచి, పాలెగాండ్లను తమ బానిసలుగా మార్చుకున్నారు. అన్ని గ్రామాలకు చెందిన పన్నులను భ్రీటీషు వారే వసూలు చేసి, పాలెగాండ్లకు వారికి నెలవారీ భరణాలు ఇచ్చేవారు.

అయితే ఉయాలవాడ జమిందారు జయరామి రెడ్ది చనిపొవడంతొ ఆ తరువాత నొస్సాం కొట కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుడయారు. 1846 జూన్‌లో నరసింహారెడ్డి తనకు రావలసిన 11 రూపాయల, 10 అణాల, 8 పైసల నెలసరి భరణం కొరకు, తన అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి జిల్లా తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, బానిస కుక్క కు ఇంత గర్వమా అని అవమానించి పంపాడు. దీనితొ ఆత్మాభిమానం దెబ్బతిన్న నరసింహారెడ్డి ఆ తహసిల్దార్ ను చంపి, బ్రిటీషు వారి కొసాగారన్ని కొల్లగొట్టి తీసుకువెళతానని లేఖ వ్రాశారు. దీనితొ బెదిరి పొయిన బ్రిటీషు ప్రభుత్వం తహసిల్దార్ కు, తమ ఖజానాలకు రక్షణ గా పెద్ద ఏత్తున సైన్యాన్ని నియమించింది.

కాని చెప్పిన మాట ప్రకారం నరసింహారెడ్డి, 500 మంది బొయలు, రైతుల సైన్యంతొ దాడిచేసి తలసిల్దార్ ను చంపి, కొయిలకుంట ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను కొల్లగొట్టాడు. అంతేకాకుండా మరొకసారి సవాల్ విసిరి దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. తమ దేశాన్ని వదిలి వెళ్లకపొతే తన కత్తికి బలౌతారాని బ్రిటీషు వారికి లేఖ పంపించారు.

తనను పట్టుకొవాలని చూస్తున్న బ్రిటీష్ అధికారి కెప్టెన్ వాట్సన్ ను దమ్ముంటే తన నొస్సాం కొటకు వచ్చి పట్టుకొమని సవాల్ విసిరారు. బ్రిటీష్ వారు రాక ముందే నొస్సాం కొటను చుట్టూ కందకాలు తవ్వించి, అందులొ సల సల కాగే నూనెను పొసి, దానిపై మట్టిని కప్పి, బ్రిటీషు సైన్యాలు కొట్టను చుట్టుముట్టగానే మరుక్షణం నిప్పును రాజేసి, బ్రిటీషు సైనికులను అగ్నికి ఆహుతి చేసాడు. అక్కడితొ ఆగకుండా మహిళలను హింసిస్తున్న పీటర్ అనే అధికారిని తన కత్తికి బలి ఇచ్చాడు.

ఇక్క అప్పటి నుండి నరసింహారెడ్డి కదనరంగంలొకి దూకి 60 గ్రామాలను బ్రిటీషు వారి చెర నుండి విడిపించారు. దీనితొ బ్రీటిష్ వారు నరసింహారెడ్డి ని పట్టించిన వరికి 1000 రూపాయాల బహుమానం ప్రకటించింది. దీనితొ డబ్బు మీద ఆశతొ నరసింహారెడ్డి దూరపు బందువైన శ్రీనివాస రెడ్ది, నరసింహారెడ్డి ని నమ్మించి దుష్ట పన్నాగంతొ నరసింహారెడ్డిని జగన్నధస్వామి ఆలయానికి తీసుకువెళ్ళి, అక్కడ బ్రిటీషు వారికి పట్టించాడు.

వెంటనే బ్రీటిషు ప్రభుత్వం నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరి తీసి, విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి అతని తలను అత్యంత పాశవికంగా 1877 వరకు అనగా 30 సంవత్సరాలపాటు కొట గుమ్మానికి వెళాడదీశారు.

ఇంత గొప్ప వీరునికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా సముచిత స్థానం లభించక పొవడం అత్యంత దురదృష్టకరం.

 

వ్యాస కర్త: krishna Pavan

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!