జీవితమంతా దేశసేవకే అంకితం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు

Share the Post
#Bharatjago : సుధాన్షు భిశ్వాస్, బహుశా ఇలాంటి వారు నూటికొ, కొటికొ ఒకరుంటారు. పెళ్ళి కూడా చేసుకొకుండా తన జీవితం మొత్తం దేశం కొసం, పేదవారి కొసం త్యాగం చేసిన మహనీయుడు సుధాన్షు భిశ్వాస్ గారు. 1918 లొ పశ్చిమబెంగాల్ లొని రామక్రిష్ణాపూర్ గ్రామంలొ జన్మించింది భిశ్వాస్ గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు. బ్రిటీష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా కలకత్తా లొ స్వాతంత్ర్యం కొసం పొరాడి అనేక సార్లు జైలుకి వెళ్ళి వచ్చారు. తెల్లని చొక్కా , తెల్లని దొవతి, తల పాగా ధరించి అతి సామాన్యంగా ఉండే భిశ్వాస్ గారు రామక్రిష్ణ పరమహంస గారికి వీర భక్తులు.
 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుందరబన్ ప్రాంతంలొ ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలొ తీవ్ర పేదరికంలొ కొట్టు మిట్టాడుతున్న పిల్లలను చూసి చలించిపొయిన భిశ్వాస్ గారు, వారి భాద్యతలను స్వీకరించారు. పేద, అనాధ పిల్లల కొసం అనాధాశ్రమాలు స్థాపించాడు. వారి చదువుల కొసం ప్రత్యేకంగా పాఠశాలలను నిర్మించారు. అయితే సమాజ సేవ, వ్యాపారం రెండు ఒకేసారి చేయడం కష్టంగా మారడంతొ, ఇక వ్యాపారానికి శాశ్వతంగా వదిలేసి పూర్తిగా పేదల సంక్షేమం కొసం పని చేయడం మొదలు పెట్టారు. ఇక సుందరబన్ లొ ఏకంగా 17 అనాధాశ్రమాలను నిర్మించారు. విరాళాలు సేకరిస్తూ పిలలకయ్యే తిండి ఖర్చు, చదువులు, బట్టలు సర్వం భిశ్వాస్ గారే భరించేవారు. వీరి కొసం ప్రత్యేకంగా స్కూల్సును నిర్మించారు.
 
.తరువాత 1971 లొ తన సొంత గ్రామమైన రామకృష్ణపూర్ లొని తనకు వారసత్వంగా వచ్చిన పొలంలొ వృద్దుల కొసం పెద్ద వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. వారికి భొజనం, పడక వసతులతొ పాటు వారి వైద్య ఖర్చులను భిశ్వాస్ గారే భరించేవారు. వారికొసం ఏకంగా ఒక హాస్పటల్ ను కట్టించి, వృద్ధులతొ పాటు పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. పేదలకు సేవ చేయడం కొసం రామక్రిష్ణ సేవాసమితి ని ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కొసం భిశ్వాస్ గారు బెంగాల్ రాస్ట్రమంతా తిరుగుతూ విరాళాలు సేకరిస్తూ ఈ సంస్థలను నడిపించడం గొప్ప విషయం.
 
భిశ్వాస్ గారు చేస్తున్న గొప్ప సామాజిక సేవలను గుర్తించిన మోది ప్రభుత్వం నిన్న ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. దీనితొ ఈ మహానుభావుని గురించి ప్రపంచానికి తెలియవచ్చింది.
 
అయితే మహాత్మా గాంధీ, వినొభాబావే లాంటి వారితొ కలిసి స్వాతంత్ర్య పొరాటం చేసిన భిశ్వాస్ గారు, సుభాష్ చంద్రబొస్ ను కలవలేక పొయినందుకు 99 ఏళ్ల వయస్సులొ ఇప్పటికీ భాధపడుతుంటారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!