రిపబ్లిక్ డే దినొత్సవంలొ తీవ్ర ఉద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్న రాస్ట్రపతి రామనాద్ కొవింద్. ఏందుకొ తెలుసా

Share the Post
#Bharatjago : ఇంతకు ముందేన్నడూ జరగని రీతిలొ అంగరంగ వైభొగంగా జరుగుతున్న రిపబ్లి డే ఉత్సవాలలొ భారత రాస్ట్రపతి రామనాధ్ కొవింద్ గారు కన్నీరు పెట్టుకున్నారు. అశొక చక్ర అవార్డులిస్తున్న సంధర్బంగా ఈ సంఘటన జరిగింది. తన ప్రాణాలను లెక్క చేయకుండా ముంబాయి దాడుల సూత్రధారి లఖ్వి మేనల్లుడు ఓవైద్ ను కాల్చి చంపి, వీరమరణం పొందిన జ్యొతి ప్రకాశ్ నిరాళా కు భారత ప్రభుత్వం అశొక చక్ర అవార్డు ప్రకటించింది. ఈరొజు ఈ అవార్డు తీసుకొవడానికి వచ్చిన నిరాళ తల్లి, భార్యలతొ సహా అతని నాలుగేళ్ల కూతురిని చూసి రాస్త్రపతి రామనాధ్ కొవింద్ గారు తీవ్ర తీవ్ర ఉద్వేగానికి లొనై , కంట తడి పెట్టారు. తరువాత కర్చీఫ్ తీసి కన్నీరు తుడుచుకున్నారు.
.
 
ముంబయి దాడులకు సూత్రధారి అయిన జకీవుర్‌ రహ్మాన్‌ లఖ్వీ ని పట్టుకొవడం కొసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బందిపుర ప్రాంతంలొ లఖ్వీ మేనల్లుడు ఓవైద్ ఉన్నట్టు భద్రతా దళాలకు పక్కా సమాచార మొచ్చింది. లఖ్వీ నెట్‌వర్క్‌లో అతని మేనల్లుడు ఒవైద్‌ కీలకమైన వ్యక్తి. ఇక గరుడ కమాండొస్, రాస్ట్రీయ రైఫిల్స్ కలిసి బందిపుర ప్రాంతంలొ పెద్ద ఏత్తున కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించాయి. లఖ్వి మేనల్లుడు ఓవైద్ తొ సహా, మరొక ఆరుగురు తీవ్రవాదులు దాక్కొని ఉన్న ఇంటిని భద్రతా దళాలు గుర్తించాయి. ఇక ఆ ఇంటిని చుట్టు ముడుతుండగా ఒక్కసారిగా తీవ్రవాదుల నుండి భారీ స్థాయిలొ కాల్పులు కారంభమైనాయి.
 
హటార్తుగా పెద్ద స్థాయిలొ కాల్పులు ప్రారంభమవడంతొ, భారత బలగాలు ముందు డిఫెన్స్ చేసుకొవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలొ ఓవైద్ తొ సహా మిగిలిన ఆరుగురు తీవ్రవాదులు పారిపొతుండగా ….. గరుడా కమాండొ జ్యొతి ప్రకాష్ నిరాలా ఒక్కసారిగా దూసుకుపొయి తీవ్రవాదులకు పారిపొయే అవకాశం ఇవ్వకుందా కాల్పులు ప్రారంభించాడు. తీవ్రవాదుల నుండి పెద్ద ఏత్తున కాల్పులు జరుగుతున్నా వెన్ను చూపలేదు, బులెట్లు ఓంటిని తూట్లు పొడుస్తున్నా పట్టించుకొలేదు, తన ప్రాణాల గురించి లెక్కచేయకుండా ఓవైద్ తొ సహా మరొక ఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపిన తరువాత “భారత్ మాతా కి జై” అంటూ నిరాలా ఒక్కసారిగా కుప్పకూలిపొయాడు. ఈ సమయంలొ మిగిలిన భద్రతా దళాలు ఇంటిని చుట్టుముట్టి మిగిలిన తీవ్రవాదులను మట్టుబెట్టారు.
.
 
అత్యున్నత దైర్యసాహసాలు ప్రదర్శించిన భద్రతా దళాలకిచ్చే ఈ అశొక చక్ర అవార్డు, ఇండియన్ ఏయిర్ ఫొర్స్ లొ ఈ అవార్డు పొందిన మూడవ వ్యక్తి జ్యొతిప్రకాష్ నిరాళా కావడం విశేషం ……  జైహింద్
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!