1947 లొనే స్వాతంత్ర్యం పొందిన ఇండియా, రిపబ్లిక్ ఇండియా గా మారడానికి రెండున్నర సంవత్సరాలు ఏందుకు పట్టిందొ తెలుసా

Share the Post
ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలొ, భారత ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకున్నారు. 1947, ఆగస్టు 15 న స్వాతంత్ర్యం సాధించిన భారతదేశం, రిపబ్లిక్ దేశంగా అవతరించడానికి రెండున్నర సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది.
 
1947 లొ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, పూర్తి స్థాయిలొ స్వాతంత్ర్యం రాలేదు. 1947 తరువాత కూడా బ్రిటీష్ రాజు “కింగ్ జార్జ్ ” కింద, బ్రిటీష్ గవర్నర్ జనరలైన విస్కౌట్ లుయీస్ మౌంట్బాటెన్ పరిపాలనలొనే కొనసాగింది.
 
అయితే దీనికి కారణం లేకపొలేదు. బ్రిటీషువారు 1935 లొ వ్రాసిన Government of India Act ప్రకారం, బ్రిటీష్ రాజు పరిపాలనలొనే భారత్ ఉండాల్సి వచ్చింది. దీని ప్రకారంగా భారత్ కొత్త రాజ్యాంగం రాసుకుని అమలులొకి తెచ్చినప్పుడు మాత్రమే భారత్ రిపబ్లిక్ గా అవతరిస్తుంది.
 
దీనితొ స్వాంతంత్ర్యం వచ్చిన వెంటనే డాక్టర్. బి.ఆర్. అంబేత్కర్ గారి ఆద్వర్యంలొ రాజ్యాంగాన్ని రచించడానికి డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్టుగానే అంబేత్కర్ గారు వేగంగా రాజ్యాంగాన్ని రూపొందించి, 1949, నవంబర్ 26 న అప్పటి నేషనల్ అసెంబ్లీకి సమర్పించారు.
.
 
అయితే జనవరి 26 వరకు ఏందుకు ఆగాల్సి వచ్చింది…. ???
 
1949, నవంబర్ 26 న రాజ్యాంగ రూపకల్పన పూర్తయి, భారత నేషనల్ అసెంబ్లీ కి సమర్పించినప్పటికీ ………. జనవరి 26 న మాత్రమే ఈ రాజ్యాంగాన్ని ఆమొదించారు.
 
ఏందుకంటే …….. మొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్నికి సంబందించిన ” ‘Declaration of Total Indian Independence ” తయారు చేసింది 1930, జనవరి 26 వ తారీకున … ఆరొజే కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ , లాహొర్ లొ భారత జాతీయ జెండా ను ఏగుర వేశారు. దీనితొ ఆ రొజుకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా 1950, జనవరి 26 న రాజ్యాంగాన్ని ఆమొదించి, భారత్ ను రిపబ్లిక్ దేశంగా ప్రకటించారు.
.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!