మట్టిలొ మాణిక్యం : వేల మందికి ప్రాణం పొసిన సూలగట్టి నర్సమ్మ

Share the Post
#Bharatjago : సూలగట్టి నరసమ్మ, కర్ణాటక లొని తుంకూరు జిల్లా వాసి అయిన 97 ఏళ్ళ నరసమ్మ గురించి, తుంకూరు జిల్లా లొ తెలియని గడప ఉండదు. ఆమె చేసిన సేవలు అలాంటివి. అప్పటిలొ తుంకూరు ప్రాంతంలొ దాదాపుగా వైద్య సదుపాయాలు ఉండేవి కాదు. 1921 లొ తుంకూరు లొ జన్మించిన నరసమ్మ, 20 ఏళ్ళకే మంత్రసానిలా మారి ప్రజలకు ఉచితంగా సాంప్రదాయ వైద్య సేవలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి రూపాయి కూడా ఫీజు తీసుకొకుండా వైద్య చేయడం ప్రారంభించిన నరసమ్మ ఏకంగా 15,000 డెలివరీలు చేసి రికార్డు స్రుష్టించింది.
 
 
ఏటువంటి వైద్య పరీక్షలు, స్కానింగ్ లు లేకుండా మహిళల గర్భాన్ని పరీక్షించి , లొపలి శిసువు నాడి ఏలా కొట్టుకుంటుందొ, బిడ్ద తల ఏటువైపు ఉందొ, బిడ్ద ఆరొగ్యం ఏలా ఉందొ చెప్ప గల గొప్ప ప్రతిభ ఆమె సొంతం. ఇంతవరకు ఆమె 15,000 డెలివరీలు చేసినప్పటికీ, ఇంత వరకు ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వక పొవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. దీనితొ నరసమ్మకు #సూలగట్టి అన్న పేరు వచ్చింది. సూలగట్టి అంటే కన్నడ భాషలొ అని అర్ధం.
 
1940 నుండి దాదాపు 70 సంవత్సరాల పాటు వైద్యసదుపాయాలు లేని ప్రాంతంలొ ఒక్క రూపాయి తీసుకొకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ, గొప్ప సమాజ సేవ చేస్తున్న సూలగట్టి నరసమ్మ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఈ రొజు రిపబ్లిక్ డే సంధర్బంగా ఆమెకు #పద్మ_శ్రీ అవార్డు ను ప్రకటించింది. 97 ఏళ్ల వయసులొ ఇప్పటికీ నరసమ్మ, ఉచితంగా వైద్య సేవలు అందిస్తుండటం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!