అమరవీరుల త్యాగాలను గౌరవించి, రిపబ్లిక్ డే రొజున మొదటిసారి పాకిస్థాన్ ను తిరస్కరించిన భారత్

Share the Post

#Bharatjago : దేశం కొసం పొరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను గౌరవించి, మొదటిసారి  రిపబ్లిక్ డే రొజున మోది ప్రభుత్వం   పాకిస్థాన్ ను తిరస్కరించింది. గత కొంత కాలంగా సరిహద్దుల వద్ద పాకిస్థాన్ అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, అనేక సార్లు భారత భద్రతా దళాల మీద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులలొ సాధారణ పౌరులతొ పాటు 13 మంది BSF జవానులు కూడా వీరమరణం పొందారు.

యుధ సమయాలలొ తప్పించి, సహజంగా రిపబ్లిక్ డే రొజున వాఘా సరిహద్దులతొ సహా మరి కొన్ని చొట్ల  పాకిస్థాన్ రేంజర్లకు, భారత బలగాలు స్వీట్లు, ఇతర తినుబండారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలొ జరిగిన కాల్పులలొ 13 మంది BSF  జవానులతొ సహా, సామాన్య పౌరులు కూడా మరణించడంతొ …. పాకిస్థాన్ రేంజర్లకు స్వీట్లు పంచితే అది వీరమరణం పొందిన జవానులను అవమానించినట్లేనని భావించిన భారత ప్రభుత్వం ఈసారి ఆ కార్యక్రమాన్ని విరమించుకుంది. అంతేకాకుండా Line of Control    పొడవునా  BSF  బదులుగా పెద్ద ఏత్తున, పూర్తిగా సాయుధులైన సైనిక బలగాలను మొహరించింది.

కాగా ఈ సంఘటనపై పాకిస్థాన్ అర్మీ జనరల్ “జావీద్ బజ్వా” మాట్లాడుతూ “దీనిని మేము అవమానంగా భావించడం లేదని, భారత బలగాలు అనేక సార్లు కాల్పుల విరమణ ఓప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపారని, ఇక నుండి అలాంటి సంఘటనలు జరిగితే ఊరుకొబొమని” కామెడి చేసాడు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!