Brave Girl : ఒక ఊరు మొత్తం చేయలేని పనిని , 16 ఏళ్ల బాలిక చేసి చూపించింది

Share the Post
#Bharatjago : ఉత్తరప్రదేశ్ లొని ఆగ్రా జిల్లాలొ ఉన్న మంతొలా ప్రాంతం అసాంఘీక కార్యకలాపాలకు, బెట్టింగ్ మాఫియా కు, జూదానికి పెట్టింది పేరు. కొందరు రాజకీయ నాయకులు, పొలీసు అధికారుల అండ ఉండటంతొ ఈ ప్రాంతంలొ ఈ మాఫియా కు తిరుగు లేకుండా పొయింది. వారి అండతొ ఈ మాఫియా, అక్కడి వ్యాపారస్తులను బెరించడం, పెద్ద మొత్తంలొ డబ్బులు వసూలు చేయడమే కాకుండా అక్కడ నివసించే ప్రజలను భయబ్రాంతులను చేయడం మొదలుపెట్టారు. మహిళల గురించి అసహ్యంగా మాట్లాడటం, ఏడిపించడం చేసేవారు. ఇంత జరుగుతున్నా మంథొల్ ప్రజలందరూ కలిసి వారిని ఏదిరించలేక పొయారు.
 
కాని 16 ఏళ్ల నజియా, బెట్టింగ్ మాఫియా ను ఏదిరించడానికి ముందుకు వచ్చింది. ఆ మాఫియా చేస్తున్న అసాంఘీక కార్యకలాపాలు, బెట్టింగులు, గ్యాంబ్లింగ్ లకు సంబందించిన పొటొలతొ సహా సాక్ష్యాలు సంపాదించి, నేరుగా పొలీస్ జనరల్ కు పంపింది. దీనితొ పొలీసులు ఆ మాఫియా కార్యకలాపాలకు పాక్షికంగా అడ్డుకట్త వేసి, నలుగురిని అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా నజియా ను అందరూ అభినందించారు. కాని అసలు కధ ఇక్కడే మొదలైంది.
 
ఈ సంఘటనలతొ రగిలిపొయిన ఈ బెట్టింగ్ మాఫియా, నజియా తొ సహా, నజియా కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టసాగారు. బయటకు వస్తే కింద పడేసి చావ గొడుతూ నరకం చూపించేవారు. ఈ క్రమంలొ నజియా తీవ్ర గాయాల పాలయింది. ఇంత జరుగుతున్న నజియా కు ఆ ప్రాంతం ప్రజలు ఏసాయం చేయలేక పొయారు. అయినా నజియా వెనుకంజ వేయకుండా ఇక్కడ జరుగుతున్న పరిస్తితుల గురించి అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు అనేక లేఖలు వ్రాసింది. కాని ఉపయొగం లేకుండా పొయాయి.
 
ఇంతలొ ఉత్తరప్రదెశ్ లొ ప్రభుత్వం మారి యోగి ప్రభుత్వం వచ్చింది. ఏవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఒక ట్వీట్ చేయండి చాలు అన్న యోగి గారి మాటలు విన్న నజియా, వెంటనే నేరుగా యోగి ఆధిత్యనాధ్ కు అక్కడ జరుగుతున్న విషయాల గురించి ట్వీట్ చేసింది. అంతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాఫియా ముఠా మొత్తాన్ని ఏ కీలుకాకీలు విరగదీసి శ్రీకృష్ణ జన్మస్థానంలొ వేశారు.
 
ఒక ఊరు మొత్తం కలిసి చేయలేని పనిని ఒక 16 ఏళ్ల బాలిక ప్రాణాలకు తెగించి, మాఫియా పై చేసిన పొరాటాన్ని అభినందిస్తూ భారత ప్రభుత్వం నిన్న నజియా ను National Bravery Award (భారత్‌ అవార్డు)  తొ సత్కరించింది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!