కురుక్షేత్ర సంగ్రామం లొ చనిపొయిన నాలుగు లక్షల మంది సైనికుల అస్తికలు ఏక్కడ ఉన్నాయి ???

Share the Post
#Bharatjago : భారతదేశ చరిత్రలొ జరిగిన అతిపెద్ద సంగ్రామమే కురుక్షేత్ర యుద్ధం. సైన్సు, ఖగొళ శాస్త్రాల ఆధారంగా ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగి దాదాపు 5500 సంవత్సరాలయినట్టు నిర్ధారించారు. ఈ యుద్దం జరిగిన కురుక్షేత్ర ప్రస్తుతం హర్యానా రాస్ట్రంలొ ఉంది. కౌరవులకు, పాండవులకు మద్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన ఈ రణరంగంలొ మొత్తం నాలుగు లక్షల మంది సైనికులు చనిపొయినట్టు మన గ్రంధాలలొ పేర్కొన్నారు. ఈ యుధం జరిగిన పద్దేనిమిది రొజులలొ జరిగిన ప్రతి విషయాన్ని, ఏక్కడ, ఏవరు, ఏటునుండి, ఏంతమంది, ఏవిధంగా చనిపొయారొ, యుధం ఏలా జరిగిందొ Minute To Minute మన గ్రంధాలలొ వివరించబడింది.
 
అయితే ఆ చనిపొయిన నాలుగు లక్షల మంది యుధ వీరుల అస్తికలు ఏక్కడ ఉన్నాయనేదే శేష ప్రశ్నగా మిగిలింది. మనకున్న సమాచారం ప్రకారం ఆ నాలుగు లక్షల మంది అస్తికలు కనిపించక పొవడానికి రెండు కారణాలున్నాయి. మన మహాభారత గ్రంధంలొ పేర్కొన్నదాని ప్రకారం
 
1) ఈ యుధం పూర్తయిన 18 వ రొజు సాయంత్రం పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు (ధర్మ రాజు), చనిపొయిన వారందరినీ యుధ వీరులుగా గుర్తించి, వారికి శాస్త్రొక్తంగా దహన సంస్కారాలు నిర్వహించి, వారి అస్తికలను మార్కాండ నదిలొ కలపమని ఆగ్ణాపించి, అందరి అస్తికలను నదిలొ కలిపే సమయంలొ చనిపొయిన అందరి తరపున వారి ఆత్మలకు శాంతి కలగాలని ధర్మరాజు తర్పన విడుస్థాడు …………. . అని మన మహాభారత గ్రంధంలొ స్పష్టంగా వ్రాయబడి ఉంది .
 
అయితే వారి ఆస్థికలు నదిలొ కలిపినప్పటికీ నాలుగు లక్షల మంది సైనికులు చనిపొయారు కాబట్టి కొన్ని అవశేషాలు మిగిలి ఉంటాయి కనుక అవి ఏక్కడున్నాయి అనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది. అయితే కొందరు జియాలజిస్టుల అంచనా ప్రకారం
 
2) కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఇప్పటికి 5500 సంవత్సరాలయింది. ఈ యుధం జరిగిన ప్రదేశం కురుక్షేత్ర ప్రాంతంలొని అడవులకు, మార్కందా నదీ తీర ప్రాంతానికి మద్యనున్న విశాల ప్రాంతంలొ జరగడం వలన ఈ మద్య కాలంలొ సంభవించిన అనేక విపత్తులు, వాతావరణ మార్పుల వలన పెద్ద ఏత్తున ఈ ప్రాంతంలొ ఇసుక, మట్టి పేరుకుపొయాయని, దీనికి తొడు ఆ ప్రాంతంలొ మానవ నిర్మాణాలు చేపట్తడం వలన వాటిని గుర్తించడం కష్టంగా మారిందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
 
అయితే ఏది ఏమైనప్పటికీ దీనికి సంబందించిన అన్ని శాఖలకు చెందిన శాస్త్రవేత్తలతొ ఒక టీం ను తయారుచేసి, సాంకేతిక పరిగ్ణానాన్ని ఉపయోగించి కురుక్షేత్ర యుధ వీరుల అస్తికలను గుర్తించాలని భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!