Big News : భారత ప్రధాని దావొస్ ప్రసంగానికి చైనా ఫిదా , కలిసి పనిచేయడానికి రెడి

Share the Post
#Bharatjago : భారత ప్రధాని నరేంద్రమోది దావొస్ ప్రసంగాన్ని చైనా ప్రశంసించింది.  ఆశ్చ్యర్యంగా నరేంద్రమోది ని పొగడ్తలతొ ముంచెత్తుతూ , భారత్ పై ఏనలేని ప్రేమను కురిపించింది. నరేంద్రమోది చెప్పిన ప్రతి మాట నిజమని, భారత్_చైనా రెండు దేశాలు ఒకే విధమైనా అలొచనలతొ ఉన్నాయని, భారత్ తొ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసింది. నిన్నటి దావొస్ ప్రసంగంలొ మోది గారు మాట్లాడుతూ ప్రపంచీకరణ వేగంగా జరుగుతున్న ఈ రోజులలో ప్రపంచానికి ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, స్వార్ధ పూరిత రక్షణాత్మక ఆర్థిక విధానాలు పెను సవాళ్లుగా మారాయని మోడీ గారు ప్రసంగించిన సంగతి తెలిసిందే.
.
.
ఈ సందర్భంగా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి “హువా ఛుస్యూమ్గ్” మాట్లాడుతూ ప్రపంచీకరణ, ప్రపంచ ఆర్హ్దిక విధానాల గురించి మోడీ అద్భుతంగా మాట్లాడారని, ఈ విషయంలో చైనా అభిప్రాయాలు కూడా అవేనని, ఈ అంశాలపై భారత్ తో కలిసి పనిచేస్తామని, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటామని అయన పేర్కొన్నారు. కొన్ని దేశాలు అనుసరిస్తున్న విధానం వలన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన తెలియజేసారు. 2017 లో జరిగిన దావోస్ సదస్సులో మాట్లాడిన చైనా అధ్యక్షుడు క్సింపింగ్ కుడా ఈ విషయాలనే ప్రస్తావించారని గుర్తు చేశారు.
.
.
.
మాకు, భారత్ కు మధ్య కొన్ని విషయాలలో విభేదాలు ఉండవచ్చని కానీ అవి తీవ్రమైనవి కావని తెలిపారు. రెండు దేశాల ఆకాంక్ష ఒక్కటే కాబట్టి , మేము భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఆశపడుతున్నామని తెలియజేశారు. ముఖ్యంగా భారత్ తో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటూ, కమ్యూనికేషన్, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసారు.
.

One thought on “Big News : భారత ప్రధాని దావొస్ ప్రసంగానికి చైనా ఫిదా , కలిసి పనిచేయడానికి రెడి

  • January 24, 2018 at 3:08 pm
    Permalink

    OK China is Happy with speech of
    World World Class Leader
    PM. Narendra Modi .But
    Indian Prime Minister Narendra Modi
    Won’t believe China Any Where
    Any Time.
    Jai Hind Jai Bharath

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!