మనీల లొ జరిగిన ASEAN సదస్సు దగ్గరి నుండి చైనా ఏందుకు నిద్రలేని రాత్రులు గడుపుతుందొ తెలుసా

Share the Post
#Bharatjago : ఆసియాలొ తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలలొ ఉన్న 10 దేశాలయిన సింగపూర్, ఇండొనేసియా, బ్రూనై, ధాయిలాండ్, ఫిలిపైన్స్, లావొస్, కాంబొడియా, మయన్మార్, మలేసియా, వియత్నాం దేశాల కూటమే ఈ ASEAN … మోది ప్రభుత్వం Act East Policy లొ భాగంగా రెండు నెలల క్రితం భారతప్రధాని నరేంద్రమోది, ఫిలిపైన్స్ లొ జరిగిన సదస్సులొ పాల్గొని ఆయా దేశాలతొ సత్సంబందాలు పెంపొందించుకొవడానికి కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ 10 దేశాలను ఏల్లుండి జరగబొయే భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆహ్వానించారు (ఈ పది దేశాధినేతలు ఈ రొజు భారత్ రానున్నారు).
 
అయితే మనీలా లొ జరిగిన India_ASEAN సదస్సు జరిగిన దగ్గరి నుండి చైనా నిద్రలేని రాత్రులు గడుపుతుంది. ఇందుకు కారణాలు లేకపొలేదు. ప్రపంచంలొ అత్యంత రధీగా ఉండే మలక్కా స్ట్రైట్ రవాణా మార్గం, ASEAN దేశాలయిన సింగపూర్, మలేసియా, ఇండొనేసియా, ధాయిలాండ్ దేశాల చేతిలొ ఉంది. ఈ మలక్కా స్ట్రైట్ రక్షణ, ట్రాఫిక్ బాద్యతలను ఈ దేశాలే నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలొ 40% వ్యాపారం ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ప్రతి సంవత్సరం చైనాకు చెందిన దాదాపు 20,000 నౌకాలు ఈ మార్గం ద్వారానే ప్రయాణం సాగిస్థాయి. సౌది అరేబియా, మిడిల్ ఈస్టు నుండి చైనా కు 80% ఆయిల్ దిగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి.
 
ఇది దృష్టిలొ పెట్టుకుని మోది ప్రభుత్వం ఆయా దేశాలను చేరదీసి, వారితొ సన్నిహిత సంబందాలు నెరుపుతుంది. అంతేకాకుండా మలక్క స్ట్రైట్ కు 90 కిలొమీటర్ల దూరంలొని క్యాంపబెల్ ద్వీపంలొ మూడు సర్వీసులకు (ఆర్మీ, నేవి, ఏయిర్ ఫొర్స్) చెందిన భారీ మిలటరీ బేస్ లను నిర్మిస్తుంది. తద్వారా చైనా ప్రారంభించనున్న OROB ప్రాజెక్టు (సముద్రం మార్గం) కు ఇబ్బందులు కలిగించడమే కాకుండా భవిష్యత్తులొ చైనాతొ విభేదాలు ముదిరితే ఈ ప్రాంతంలొ చైనా ను Block చేయడం ద్వారా చైనాను చావు దెబ్బ కొట్టవచ్చనేది మోది ఆలొచన.
 
ఇక మిగిలిన ASEAN దేశాలయిన కాంబొడియా, వియత్నాం, బ్రూనై, ఫిలీపిన్స్ దేశాలు కీలకమైన దక్షిణ చైనా సముద్రంలొ ఉన్నాయి. దీని వలన ఆయా దేశాలతొ ద్వైపాక్షిక, ప్యూహాత్మక, రక్షణ, వ్యాపార సంబందాలు ఏర్పరచు కొవడం ద్వారా, ఆయా దేశాలతొ వ్యాపార_వాణిజ్యాలను కొనసాగిస్తూ దక్షిణ చైనా సముద్రంలొ తిష్ట  వేసి, చైనా హవా తగ్గించవచ్చనేది మోది ప్రభుత్వ ప్యూహం.
 
చైనాకు చెక్ పెట్టడానికి కావలసిన అత్యంత ముఖ్యమైన ఈ రెండు అంశాలు ASEAN దేశాలతొ ముడిపడి ఉండటంతొ ప్రధాని మోది గారు ఈ దేశాలతొ మరిన్ని ఒప్పందాలు చేసుకొవడం కొసం , ASEAN దేశాలను ఏల్లుండి జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాలకు అహ్వానించారు. దీనితొ సరిగ్గా మనీలా సదస్సు దగ్గరి నుండే చైనా అధ్యక్షుడు క్సింపింగ్ , తీవ్రంగా మధనపడుతున్నాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!