కువైట్ లొని తెలుగు కార్మికుల సమస్యను పరిష్కరించిన భారత ప్రభుత్వం

Share the Post
#Bharatjago : అనేక నెలల నుంది కువైట్ లొ తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొంటున్న వేల మంది తెలుగు కార్మికులు ఏదుర్కొంటున్న సమస్యలను ఏట్టకేలకు భారత విదేశాంగశాఖ పరిష్కరించింది. భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి, మాజీ జనరల్ vk. సింఘ్ గారు వారం రొజుల క్రితం స్వయంగా కువైట్ వెళ్ళి అక్కడి ప్రభుత్వాధి నేతలతొ చర్చలు జరపడంతొ కువైట్ లొ ఉన్న తెలుగు కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యాయి.
 
జీవనొపాధి కొసం తెలుగు రాస్ట్రాల నుంది కువైట్ వెళ్ళి తెలుగు కార్మికులు కువైట్ లొని అతి పెద్ద మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ అయిన కరాఫి నేషనల్ లొ చాలా రొజులు పని చేసారు. అయితే కాంట్రాక్టు పూర్తయినప్పటికీ, కార్మికులకు జీతాలు ఇవ్వకుండా, కరాఫి నేషనల్ సంస్థ వేధిస్తుండటంతొ, ఉత్త చేతులతొ ఇంటికి రాలేక, విసా గడువు పూర్తయినప్పటికీ, జీతాల కొసం తెలుగు కార్మికులు అక్కడే ఉండవలసి వచ్చింది. అయితే వీసా గడువు పూర్తయినప్పటికీ, తమ దేశంలొ ఉన్నందుకు కువైట్ ప్రభుత్వం తెలుగు కార్మికులపై రొజుకు రెండు కువైట్ దీనార్లు (424 రూపాయలు) పెనాల్టీ విధించింది.
 
ఈ విషయం తెలుసుకున్న భారత విదేశాంగశాఖ, వెంటనే భారత ప్రభుత్వం తరపున కువైట్ అధారిటీస్ తొ చర్చలు జరపడానికి మాజి జనరల్ VK. సింగ్ గారిని కువైట్ పంపించింది. వారం రొజుల క్రితం కువైట్ వెళ్ళిన VK. సింఘ్, కువైట్ అధికారులతొ, మంత్రులతొ సమావేశమై భారత కార్మికుల సమస్యల పై చర్చించారు.
 
దీనితొ భారత కార్మికులపై ఏటువంటి చర్యలు తీసుకొబొమని , ఫిబ్రవరి 22 వరకు వారికి తమ దెశంలొ ఉండేలా అవకాశం కల్పిస్తున్నామని కువైట్ తెలియజేసింది. అంతెకాకుందా అక్కడే ఉండాలనుకునే వారు మరల అగ్రిమెంట్ చేసుకునే అవకాశం కూడ కల్పించడం విశేషం. ఈ సంధర్బంగా కువైట్ పబ్లిక్ అధారిటీ డైరక్టర్ జనరల్ అబ్దుల్లా-అల్-ముథొతి మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం గురించి కార్మికులు లేవనెత్తిన పిర్యాధులపై విచారణ జరిపేందుకు ఏనిమిది మందితొ కూటిన స్పెషల్ టీం ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!