Major Development : మరొక అద్భుత ప్రయోగానికి నాంది పలకనున్న భారత్ 💪💪💪
#Bharatjago : మిసైల్ టెక్నాలజీ లొ భారత్ దూసుకుపొతుంది. ఇప్పటికే 450 కిలొమీటర్ల దూరంలొ ఉన్న లక్ష్యాలను, శత్రువులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ద్వంసం చేయగల బ్రాహ్మాస్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా అభివృధి చేసిన భారత్, ఇప్పుడు మరొక ముందడుగు వేసింది. ఇప్పుడు బ్రహ్మాస్ క్రూయిజ్ మిసైల్ పరిధిని ఏకంగా 800 కిలొమీటర్లకు అభివృధి చేసింది. ఇప్పటికె బ్రహ్మాస్ పరిధిని రెండు విదతలుగ 290 కిలొమీటర్ల నుండి 450 కిలొమీటర్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా బ్రహ్మాస్ పరిధిని 800 కిలొమీటర్లకు అభివృధి చేసిన భారత్, మరి కొద్ది నెలలలొ దీనిని పరీక్షించనుంది.
ఇప్పుడు ఈ సూపర్ సానిక్ మిసైల్ రేంజి ని 800 కిలొమీటర్లకు పెంచడం ద్వారా టిబెట్ , క్సింజియాంగ్ ప్రాంతాలలొని అన్ని చైనీస్ మేజర్ మిలటరీ స్థావరాలన్నీ బ్రహ్మాస్ పరిధిలొకి రానున్నాయి.
.
.
రష్యా, భారత్ దేశాలు సమ్యుక్తంగా తయారు చేస్తున్న ఈ సూపర్సోనిక్ మిసైల్ ను, నేలపై నుండి, సముద్రంపై నుండి (యుద్ధ నౌకల నుండి), సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుండి), ఆకాశం నుండి (యుద్ధ విమానాల నుండి) ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. 2017, అక్టొబరు లొ సుఖొయ్-30 నుండి పరీక్షించిన బ్రహ్మాస్ మిసైల్ ప్రయోగం నూరు శాతం విజయవంతమైంది. ఆకాశం నుండి ప్రయోగించే బ్రహ్మాస్ మిసైల్స్ ను అడ్దుకొవడం ఏవరి తరం కాదు. ఆకాశం నుండి ప్రయోగించబడే బ్రహ్మాస్ మిసైల్స్ నేరుగా శత్రు స్థావరాలలొకి చొచ్చుకుపొయి భారీ విద్వంసాన్ని సృష్టిస్థాయి. 3,700 కిలొమీటర్ల వేగంతొ ప్రయాణించే ఈ మిసైల్, ప్రపంచంలొ ఉన్న అన్ని మిసైల్స్ కన్నా అత్యంత వేగవంతమైనది.
ఇప్పుడు 800 కిలొమీటర్ల పరిధి ఉన్న బ్రహ్మస్ మిసైల్ మన చేతిలొ ఉందంటే ఇక ఏవరైనా మన జొలికి రావడానికి ఒకటికి వందసార్లు ఆలొచించుకొవలసిందే. అందుకొసమే ఈ సూపర్ సానిక్ మిసైల్స్ ను సుఖొయ్-30 లతొ సహా తేజాస్, Mig-29s (Upgrade), రాఫెల్ ఫైటర్లకు కూడా Instal చేయనున్నారు.
.
Super I like this very much