భారత ఫ్రధాని దావొస్ పర్యటన సంధర్బంగా నరేంద్రమొది హొర్డింగులతొ నిండిపొయిన దావొస్ పట్టణం

Share the Post
#Bharatjago : ప్రస్తుతం స్విడ్జర్లాండ్ లొని దావొస్ పట్టణమంతా బారతీయ వాతావరణాన్ని సంతరించుకుంది. భారత ప్రధాని నరేంద్రమోది గారు మొదటిసారి దావొస్ లొని ప్రపంచ ఆర్ధిక సదస్సులొ పాల్గొంటున్న సంధర్బంగా దావొస్ పట్టణమంతా మొది గారి హొర్డింగులతొనూ, Make In India హొర్డింగులతొనూ, భారతీయ కంపెనీలకు చెందిన హొర్డింగులతొనూ నిండి పొయింది. ఈ సదస్సుల్లొ పాల్గొనడానికి నరేంద్రమోది గారితొ పాటు కేంద్రమంత్రులు, మహారాస్ట్ర,  ఆంద్రప్రదేశ్  రాస్ట్రాల  ముఖ్యమంత్రులతొ సహా 100 మందికి పైగా భారతీయ కంపెనీలకు చెందిన CEO లు పాల్గొననున్నారు.
.
 
100 కు పైగా భారతీయ సంస్థలకు సంబందించిన CEO లు ఈ సద్దస్సులొ పాల్గొంటుండటంతొ, ఆయా కంపెనీలు పెద్ద ఏత్తున తమపరివారంతొ దావొస్ లొ తిష్ట వేశాయి. దీనితొ దావొస్ లొ భారతీయ వంటకాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా చాయ్, పకొడా, పావ్ బాజి, దొశ వంటకాలను బాగా డిమాండ్ పెరిగింది. ఇందు కొసం భారత ప్రభుత్వం అన్నీ సౌకర్యాలతొ పెద్ద లాంజ్ లను ఏర్పాటు చేసింది. ఈ సంధర్బంగా 120 మంది CEO లకు మోది గారు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.
.
 
కాగా ప్రపంచంలొని 190 దేశాలకు సంబందించిన అత్యంత శక్తివంతమైన వ్యక్తులతొ పాటు 70 దేశాలకు చెందిన దేశాధినేతలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్న ఈ సదస్సులొ మొదటి ప్రసంగం భారత ప్రధాని చేయనుండటం భారతదేశానికి గర్వ కారణం కానుంది. మొత్తంగా ఈ సదస్సులొ అత్యదికంగా పెట్టుబడులను ఆకర్షించే దేశాల జాబితాలొ భారత్, ఐదవ స్థానంలొ ఉందని “Global CEO’s ” సర్వే తెలియజేసింది.. ఈ సదస్సులొ మొత్తం అధికారికంగా 400 సెషన్స్ జరగనుండగా, అందులొ భారత కేంద్ర మంత్రులు 29 సెషన్స్ లొ ప్రసంగించనున్నారు. అలాగే మహారాస్ట్ర సి.యం దేవేంద్ర ఫడ్నవీస్ 4 సెషన్లతొ పాటు మరొక ప్రత్యేక సెషన్ లొ ప్రసంగించనున్నారు.
.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!