ప్రపంచానికి వసుదైక కుంటుంబ సిద్దాంతాన్నిపరిచయం చేసింది భారతదేశమే – దావొస్ లొ మోది అద్భుత ప్రసంగం

Share the Post
#Bharatjago : దావొస్ లొ జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులొ భారత ప్రధాని ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా సాగింది. మోది గారి ప్రసంగం ప్రధానంగా భారతదేశ విశిష్టత గురించి, భారతీయ గొప్పతనం గురించే ఏక్కువగా సాగింది. 1997 లొ భారత ప్రధాని దావొస్ వచ్చినప్పుడు భారత ఆర్ధిక వ్యవస్థ కేవలం 400 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండెది, కాని ఇప్పుడు ఆరు రెట్లు పెరిగిందని మోది తెలియజేశారు. ప్రపంచ మంతా ఒక్కటేనన్న వసుదైక కుటుంబం సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమేనని, ప్రపంచంలొ దేశాల మద్య అంతరాలు తగ్గించడానికి ఈ నినాదం ఏప్పటికీ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సమస్యలు వచ్చినపుడు అందరూ ఒక్కటిగా కలిసి ఎదుర్కొవాలని, మనల్ని విడగొట్టేవాళ్ళు ఈ సమస్యలను మరింత కఠినతరం చేస్తున్నారన్నారు.
 
ఇప్పుడు భారత ఆర్ధిక వ్యవస్థలొ అనేక మార్పులు వచ్చాయని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని తెలియజేసారు. ప్రకృతితో మమేకమవడం భారత్‌ విధానమని , అవసరమైనంత వరకే దాచుకోవడం భారతీయుల విధానమని మోది తెలియజేశారు. ఉగ్రవాదంతొ ప్రపంచానికి సమస్యలు ఏర్పడుతున్నాయని, ఉగ్రవాదంపై ద్వంద వైఖరి పనికి రాదని, ఉగ్రవాదులలొ మంచి, చెడు తారతమ్యాలు ఉండవని భారత ప్రధాని తేల్చి చెప్పారు. . మనం సుఖం, స్వార్ధం కొసం ప్రకృతిని నాశనం చేస్తే, భవిష్యత్తు తరాలు ఇబ్బందులు ఏదుర్కొంటాయని తెలియజేసారు. ఆయుర్వేదం, యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందని భారతదేశమేనని మోది గారు గుర్తు చేశారు.
 
భిన్నమతాలు, సంస్కృతులు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ ఏకతాటిపై నిలుపుతోందని, భారత ప్రజాస్వామ్యం రాజకీయ విధానం కాదని జీవన శైలి అని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. మనమంతా ఒకే కుటుంబం అన్న సిద్ధాంతాన్ని అందరూ గుర్తు పెట్టుకొవాలని ఆయన ఈ సంధర్బంగా పేర్కొన్నారు. 2022 నాటికి 170 గిగావాట్ల విద్యుత్‌ సామర్ధ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు. సైబర్‌ పరిజ్ఞానం చెడు పనులకు వినియోగించకుండా నిరోధించడమే అసలైన సవాల్‌గా మారిందని స్పష్టం చేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!