దావొస్ ప్రపంచ సదస్సులొ భారతీయ మానవతామూర్తి కి దక్కిన అత్యంత అరుదైన గౌరవం

Share the Post
#Bharatjago : అనేక దేశాల అధినేతలకు కూడా లభించని అవకాశం, మహిళా సాధికారత కొసం పనిచేస్తున్న భారతీయ స్త్రీమూర్తి కి దక్కింది. ఆమే చేతనా సిణ్హా. దావొస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులొ పాల్గొనడమంటే మాటలు కాదు. ప్రపంచంలొనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది లేదా కొట్లు ఖర్చు పెట్టి ఈ సదస్సులొ పాల్గొనాల్సి . ఒకవేళ ఈ సదస్సులొ పాల్గొన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రసంగించే అవకాశం రావడం సాద్యమయ్యే పని కాదు… కాని అటువంటి అత్యంత అరుదైన గౌరవాన్ని చేతన్ సిణ్హా గారు పొందారు. IMF డైరక్తర్, నార్వే మాజీ ప్రధాని లాంటి ఆరుగురు అత్యున్నత స్థాయి మహిళలతొ కలసి చేతనా గారు దావొస్ వేదిక పంచుకొనుండటం విశెషం.
.
 చిన్నతనం నుండే సమాజిక స్ప్రుహ కలిగిన చేతనా సిణ్హా గారు, జనతా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారి అభిమాని. చేతనా గారు పుట్టింది, పెరిగింది ముంబాయి లొ అయినప్పటికీ, పెళ్ళయిన తరువాత మాస్వాద్ పట్తణంలొ స్తిరపడ్దారు. అయితే మాస్వాద్ ప్రాంతం అత్యంత కరువు ప్రాంతం కావడంతొ, అ ప్రాంతంలొని పల్లెటూరి మహిళల పరిస్తితులు మరీ ఘొరంగా ఉండటంతొ, గ్రామీణ మహిళల సాధికారతకై చేతనా సిణ్హా గారు నడుంబిగించింది. అక్కడి పల్లెటూరి మహిళల కొసం ఒక కోఆపరేటివ్ బ్యాంకు ను ప్రారంభించారు. అయితే అందులొని సభ్యులందరు నిరక్ష్యరాస్యులు కావడంతొ ఆమె అప్లికేషన్ ను RBI తిరస్కరించిది. అంతే చేతనా సిణ్హా గారు వెంటనే అ గ్రామాలకు వెళ్ళి ఐదు నెలలు కష్టపడి వారికి చదువు చెప్పి, మరలా RBI కు అప్లికేషన్ పెట్టి రూరల్ మహిళా కోఅపరేటివ్ బ్యాంకు ను ప్రారంభించారు.. ఆ బ్యాంకు కు Mann Deshi Mahila Sahkari Bank అని నామకరణం చేశారు. మన దేశంలొ RBI నుండి లైసెన్సు పొందిన మొట్టమొదటి గ్రామీణ మహిళా సహకార బ్యాంకు ఇదే.
.
.
మొదట 1335 మంది సభులతొ, 7,08,000 రూపాయ్లతొ ప్రారంభమైన ఈ సహకార బ్యాంకు ప్రస్తుతం 3,10,000 మంది గ్రామీణ మహిళా సబ్యులతొ అనేక వేల మంది మహిళలకు సహాయ మందించారు. మహిళల స్వయం ఉపాధి కొసం ఈ బ్యాంకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. నొట్లరద్దు సంధర్బంగా చిల్లర దొరకక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతొ, ఈ సహకార బ్యాంకు నేరుగా సిండికేట్ బ్యాంకు దగ్గరి నుండి కాయిన్స్ తీసుకుని, వారానికి ఒకసారి ప్రతి ఇంట్టింటికీ తిరిగి పాత నొట్లకు చిల్లర ఇచ్చేవారు. ఇవి చాలు చేతనా సిణ్హా గారు గారు తన సామాజిక భాద్యతను ఏ విధంగా నిర్వర్తించారొ చెప్పడానికి.
 
ప్రస్తుతం సహకార బ్యాంకు చైర్మన్ గా, సామాజిక కార్యకర్తగా మొదటిసారి ఒక భారతీయురాలు దావొస్ వేదికపై మాట్లాడనుండటం విశేషం.
.

One thought on “దావొస్ ప్రపంచ సదస్సులొ భారతీయ మానవతామూర్తి కి దక్కిన అత్యంత అరుదైన గౌరవం

  • January 23, 2018 at 4:38 pm
    Permalink

    Hatsup sister (chetana sinha) for duty & response of citizen

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!