Breaking News : గుజరాత్ లొ బయటపడిన అతి పెద్ద “డైనొసార్ గుడ్డు”

Share the Post
#Bharatjago : ఒకప్పుడు గుజరాత్ లొని బాలాసినొర్ ప్రాంతం డైనొసార్లకు పుట్టినిల్లు అన్న విషయం మరొకసారి ఋజువైంది. మొన్న మరొకసారి గుజరాత్ లొని ఈ ప్రాంతంలొనే డైనొసార్ గుడ్డు బయట పడింది. గుజరాత్ లొని మహిసాగర్ రాస్ట్రంలొని బాసినొర్ నగరానికి 10 కిలొమీటర్ల దూరంలొ ఉన్న మువాడ గ్రామంలొ ఈ డైనొసార్ గుడ్డు బయట పడింది. ఆ గ్రామంలొ ఒక ఇంటి నిర్మాణంలొ భాగంగా భూమిని తవ్వుతుండగా ఈ గుడ్డు బయట పడింది. అయితే తవ్వకాల వలన గుడ్డు పగిలినప్పటికీ బాగానే ఉందని, ఈ గుడ్డు రాజసురస్ జాతికి చెందిన డైనొసార్ ది అయిఉండవచ్చని పరిశొధకులు అంచనా వేస్తున్నారు.
.

.

మొదటిసారి 1980 లొ బాలాసినొర్ ప్రాంతంలొ డైనొసార్ గుడ్డ్లు బయట పడ్డాయి. తరువాత ఇదే ప్రాంతంలొ 1982, 84 సంవత్సరాలలొ డైనొసార్లకు చెందిన అనేక అవశేషాలు ఇదే బాలాసినొర్ ప్రాంతంలొ బయటపడ్దాయి. దీనితొ డైనొసార్ అవశేషాలు బయటపడ్ద ఆ ప్రాంతాన్ని డైనొసర్ పార్క్ గా మార్చి వేశారు. ఇది ప్రపంచంలొనే అతి పెద్ద రెండవ డైనొసార్ హేచరీ కావడం విశేషం. దీనిని ఇండియన్ జురాసిక్ పార్క్ అని కూడా పిలుస్థారు. ఆరు కొట్ల సంవత్సరాల క్రితం, గుజరాత్ లొని బాలాసినొర్ ప్రాంతం నుండి మద్యప్రదేశ్ వరకు నర్మదా నదీ తీరం పొడవునా డైనొసార్లు సంచరిస్తుండేవని , అందుకే వీటికి రాజసురస్ నర్మదీనియన్ డైనొసార్లు అని పేరు పెట్టినట్టు శాస్తవేత్తలు తెలియజేశారు.

.

 
ఈ రాజసురస్ నర్మదీనియన్ డైనొసార్లు దాదాపు 3000 కేజీల బరువుతొ, 2.4 మీటర్ల ఏత్తు, తొమ్మిది మీటర్ల పొడవు కలిగి ఉండేవని, ఇవి గుడ్లు పెట్టడానికి గుజరాత్ లొని బాలాసినొర్ ప్రాంతం అనుకూలంగా ఉండేదని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
.
 
కాగా ఇప్పుడు కనుగొన్న డైనొసార్ గుడ్డు ను పరిశొధనల నిమిత్తం జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు పంపించనున్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!