Big News : హఫీజ్ సయ్యద్ పై చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ వెళ్ళనున్న UNSC Team

Share the Post
#Bharatjago :  2008 ముంబాయి దాడుల సూత్రధారి, అంతర్జాతీయ తీవ్రవాది అయిన హఫిజ్ సయ్యద్ పై చర్యలు తీసుకొవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఇందులొ భాగంగా పాకిస్థాన్ పై వత్తిడి తెచ్చేందుకు, హఫీజ్ సయ్యద్ పై చర్యలు తీసుకొనేందుకు భద్రతామండలి కి చెందిన ప్రత్యేక మానిటరింగ్ టీం మరొక మూడు రొజులలొ పాకిస్థాన్ లొ పర్యటించనుంది.
 
భారత్_అమెరికా ల తరపున ఈ నెల 25,26 తేదీలలొ పాకిస్థాన్ లొ ఈ మానిటరింగ్ టీం పర్యటించనుంది. గత సంవత్సరంలొ గృహ నిర్బందం నుండి విడుదలైన హఫీజ్ సయ్యద్ కు పాకిస్థాన్ లొ భారీ Net Work ఉంది. 70 కి పైగా ఉన్న అతని సంస్థలలొ దాదాపు 55,000 మంది పనిచేస్తున్నారు. ఈ మద్యకాలంలొ హఫీజ్ సయ్యద్ మరలా తన కార్యకలాపాలను తీవ్రతరం చేశాడు. బహిరంగంగానే ప్రజలను రెచ్చగొడుతూ యువకులను తీవ్రవాదం మళ్ళేటట్టు చేస్తుండటంతొ ……….. హఫీజ్ సయ్యద్ పై చర్యలు తీసుకునేలా ఇస్లామాబాద్ పై ఒత్తిడి తీసుకురావడానికి మరియు అక్కడి వాస్థవ పరిస్తితులను తెలుసుకునేందుకు ఈ టీం పర్యటించనుంది.
 
మూడు రొజుల క్రితం పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ, హఫీజ్ అసయ్యద్ పై ఏటువంటి కేసులు లేవు కాబట్టి, అతనిపై ఏటువంటి చర్యలు తీసుకొలేమని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితొ ఒళ్ళు మండిన అమెరికా, హఫీజ్ సయ్యద్ సంస్థలపై నిషేధం విధిస్తే సరిపొదని, సయ్యద్ కు చట్తప్రకారం శిక్ష (ఊరి శిక్ష) విధించాల్సిందేనని పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చింది. నేరుగా ఆల్ ఖైదాకు నిధులు అందిస్తూ, లష్కరే తొయాబా_జమాతుల్ దావా తీవ్రవాద సంస్థలను పెంచి పొషిస్తున్న హఫీజ్ సయ్యద్ 2008, ముంబాయి దాడులలొ 166 మంది చావుకు కారణమయ్యాడని, అతనికి ఖచ్చితంగా చట్టప్రకారం శిక్షించవలసినదేనని అమెరికా హెచ్చరించింది.
 
ఒకవేళ తీవ్రవాదం పై సరయిన చర్యలు తీసుకొక పొయినట్లయితే, పాకిస్థాన్ ఏటువంటి పరిణామాలు ఏదుర్కొవాల్సి వస్తుందనే విషయం ఇప్పటికే పాకిస్థాన్ కు స్పష్టంగా తెలియజేసినట్టు ట్రంప్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలియజేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!