Big Boost to Modi : అభివృధిలొ చైనా పై స్పష్టమైన ఆధిక్యతను కనబరచనున్న భారత్ – IMF

Share the Post
#Bharatjago : స్తూల దేశీయ ఉత్పత్తి (GDP)  లొ చైనా పై భారత్ స్పష్టమైన ఆధిక్యతను కనబరచనున్నట్టు “ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్” (IMF) సంస్థ పేర్కొంది. నొట్లరద్దు, GST వంటి ఆర్ధిక సంస్కరణల తరువాత భారత్ మరలా World Growth leader గా తన స్థానాన్ని పొందనుందని తెలియజేసింది. ఆర్ధిక సంస్కరణల వలన కొద్ది కాలం భారత అర్ధిక వ్యవస్థ మందగించినప్పటికీ, భవిష్యత్తులొ మరింత పటిష్టం చేసుకొనుందని ఈ సంస్థ తెలిపింది.
.
దావొస్ లొ ప్రపంచ ఆర్ధిక సద్దస్సు జరుగుతున్న సంధర్బంగా IMF స్విడ్జర్లాండ్ లొ తమ నివేదికను ను రీలీజ్ చేసింది. 2018 లొ భారత స్థూల దేశీయ ఉత్పత్తి 7.4 % ఉండనుండగా, చైనా స్తూల దేశీయ ఉత్పత్తి కేవలం 6.8 % గా ఉందనుందని తెలియజేసింది ………. అలాగే 2019 లొ భారతదేశ స్తూల దేశీయ ఉత్పత్తి 7.8% ఉండనుండగా, చైనా స్తూల దేశీయ ఉత్పత్తి 6.4% నికి పడిపొనుందని తన నివేదికలొ పేర్కొంది. తద్వారా భారత్, చైనా పై స్పష్టమైన ఆధిక్యతను కనబరచనుందని IMF తెలియజేసింది
 
మొత్తంగా చైనా  GDP తగ్గనుండగా, అదే సమయంలొ భారత్ దూసుకు పొనుందని IMF తెలియజేసింది. తద్వారా భారత్ World Growth leader గా అవతరించనుందని తన నివేదికలొ పేర్కొంది. కాగా కొద్ది రొజుల క్రితం ప్రపంచ బ్యాంకు కూడా దాదాపు ఇటువంటి నివేదికనే విడుదల చేయడం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!