చైనాకు చెక్ పెట్టడానికి మిలటరీలొ “రొబొ ఆర్మీ” ని పవేశపెట్టనున్న భారత్, జపాన్ దేశాలు

Share the Post
#Bharatjago : భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలొ మరొక పెద్ద అడుగు వేయనున్నాయి. విస్థరణ కాంక్షతొ దూకుడుగా వెళ్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు రొబొ ఆర్మీ ని మిలటరీలొ ప్రవేశపెట్టాలని భారత్, జపాన్ దేశాలు నిర్ణయించాయి. జపాన్, భారత్ రెండు దేశాలకు చైనా తలనొప్పిగా మారడంతొ ఈ విషయంలొ రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇకనుండి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రొబొటిక్స్ విషయంలొ రెండు దేశాలు సమ్యుక్తంగా అభివృధి చేయనుండటం విశేషం. అణు ఒప్పందం తరువాత భారత్, జపాన్ దేశాలు తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇదే.
 
డిల్లీలొని “రైసినా డైలాగ్” ఈవెంట్ లొ పాల్గొన్న జపాన్ జాతీయ భద్రతా సలహాదారు ” కెంటారొ సొనొరా” మాట్లాడుతూ ఆసియాలొ దూకుడుగా వెళ్తున్న చైనా కు అడ్డుకట్త వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకొసం రొబొటిక్ ఆర్మీ ని మిలటరీలొ ప్రవేసపెట్తనున్నట్టు తెలియజేసారు. ఆర్టిఫీషియల్ ఇంటెలియన్, రొబొ టెక్నాలజీని అభివృధి చేసే విషయంలొ రెండు దేశాలు కలిసి పనిచేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలొ తొందరగా అయితే అంత తొందరగా, ఈ నెలాఖరుకే  Unmanned ground vehicles (UGV) ప్రాజెక్టును ప్రారంభించనున్నట్తు ఆయన తెలిపారు. ఇప్పటికే ఇరుదేశాల ప్రధానులు దీనికి సంబందించిన Experts Team ను ఏర్పాటు చేయడానికి అంగీకరించారని, సాద్యమైనంత త్వరగా ఆర్మీలొకి ప్రవేశపెట్తనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
.
.
ఇండొ_ఫసిఫిక్ అనే పధాన్ని అమెరికా ఇప్పుడు మొదలుపెట్టినప్పటికీ, 2007 లొనే ఇండొ_ఫసిఫిక్ అనే పధాన్ని సృష్తించింది జపాన్ ప్రధాని “షింజొ అబె” ఏనని ఆయన గుర్తు చేశారు. 2018 లొ ఇండొ_ఫసిఫిక్ ప్రాంతంలొ పెద్ద ఏత్తున స్వేచ్చా వాణిజ్యం నిర్వహించడానికి కలిసి పనిచేస్థామని, ఇండొ_ఫసిఫిక్ పాలసీ, భారత్ ప్రారంభించిన యాక్ట్_ఈస్ట్ పాలసీ గాని రెండు దాదాపు ఒకేరకమైన లక్ష్యాలను కలిగి ఉన్నాయని ఆయన తెలియజేసారు.
 
చైనా ప్రాంతీయ రాజకీయల కారణంగా, చైనా వలలొ చిక్కుకున్న శ్రీలంక, పాకిస్థాన్, మాల్దివులు దేశాలలొ ఇప్పటికే తాను పర్యటించానని, అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలను సాధ్యమైనంత త్వరగా భారత్, అమెరికా లతొ కలిసి ఆయా దేశాలను చైనా గుప్పిటలొ నుండి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ తీవ్రవాదం విషయంలొ రాజిపడేది లేదని, ఖచ్చితంగా పాకిస్థాన్ తీవ్రవాదం విషయంలొ ఖటిన వైఖరిని అవలంబించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
.

One thought on “చైనాకు చెక్ పెట్టడానికి మిలటరీలొ “రొబొ ఆర్మీ” ని పవేశపెట్టనున్న భారత్, జపాన్ దేశాలు

  • January 22, 2018 at 5:12 pm
    Permalink

    all good signs
    😁😁😁😁😁

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!