ఎల్లకాలం కేంద్రం మీద అపవాదు వేయడమేనా టిడిపి పని – టిడిపి పై విరుచుకుపడిన సొమువీర్రాజు

Share the Post
#Bharatjago : మరొకసారి సొము వీర్రాజు గారు టిడిపి పై విరుచుకు పడ్దారు. ఒక న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలొ మాట్లాడూ రాస్ట్రంలొ సంపద పెంచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఏల్లకాలం కేంద్రం పై నిందలు వేయడమే టిడిపి పనిగా పెట్టుకుందని పేర్కొన్నారు. టిడిపి కొర్టుకు వెళితే మేము కొర్టుకు వెళతామని, మాకు కొర్టుకు వెళ్ళడానికి 100 అంశాలున్నాయని తేల్చి చెప్పారు. 2016 దాకా పొలవరాన్ని ఏందుకు పొలవరం మొదలు పెట్టలేదని, ఇనాళ్ళు వేల కొట్ల రూపాయల ఇసుకను కొందరు ప్రజాప్రతినిధులు దొంగిలిస్తూ ఉంటే దానిపై కొర్టుకు వెళ్ళలేమా, రాస్ట్రంలొ జరుగుతున్న అనేక పరిణమాలపై మేము కొర్టుకు వెళ్ళలేమా అని స్పష్టం చేశారు.
 
విభజన హామీలను బిజెపి ప్రభుత్వం నేరవేర్చుతున్నప్పటికీ, చంద్రబాబు నాయుడు మాత్రం విభజన హామీలను కేంద్ర నెరవేర్చడం లేదని పెద్ద ఏత్తున ప్రచారం చేస్తూ, ప్రజలలొ బిజెపి పై వ్యతిరేకత తీసుకువచ్చి 2019 నాటికి బిజెపి ని జిరొ చేయాలనే చూస్తున్నారని ….. , బల్ల గుద్ది మరీ చెబుతున్నాను ఏట్టి పరిస్తితులలొ ఆంద్రప్రదేశ్ లొ బిజెపి ని జిరొ చేయనివ్వమని, ఇలాంటి టక్కు టమార విద్యలు 2004 వరకు జరిగాయి కాని ఇప్పుడు జరగనివ్వమని తేల్చి చెప్పారు. మేము ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకొవడం లేదని, అలాగే ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం మీడియాకు ఉందని హితవు చెప్పారు.
 
ఈ సంధర్బంగా ఏ పధకానికి ఏన్ని నిధులిచారొ లెక్కలు చెబుతూ,కేంద్ర ప్రభుత్వ పధకాలలొ ఏక్కడా మోది గారి పొటొ పెట్టడానికి కూడా ఏందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హొదా విషయంలొ ఆంద్రప్రదేశ్ ను బిజెపి మోసం చేసిందని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రత్యేక ప్యాకేజికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నప్పటికీ, మిడియా మాత్రం బిజెపి ని మాత్రమే ఈ ప్రశ్నను అడుగుతుందని, ఇస్త్తున నిధుల గురించి మాత్రం వెల్లడించకుండా దాచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
మీ బలమెంత అని మమల్ని ప్రశ్నిస్తున్నారు, మొన్న జరిగిన గ్రాడ్యుఏట్స్ MLC ఏన్నికలలొ బిజెపి కి వ్యతిరేకంగా నాలుగు లక్షల కరపత్రాలు పంచినప్పటికీ వైజాగ్ లొ బిజెపి అభ్యర్ధి మాత్రమే విజయం సాధించాడని, టిడిపి పొటీచేసిన మూడు చొట్ల ఓడిపొయిందని గుర్తు చేశారు. 2013 లొ చంద్రబాబు నాయుడు, మేము బిజెపి తొ కలవడం చారిత్రత్మక తప్పిదమని వెళ్ళిన ప్రతి చొట చెప్పి, మరలా 2014 ఏన్నికల ముందు బిజెపి తొ పొత్తు కు సిధమయ్యారని, ఏవరు ఏలాంటి వారే ప్రజలు గమనించాలని ఆయన తెలియజేశారు.
 
మిత్రపక్షమై ఉండి ప్రధాని నరేంద్రమోది దిష్టి బొమ్మలు దగ్దం చేసినప్పటికీ, ఏనాడు మేము టిడిని ప్రశ్నిచలేదని ఆయన పేర్కొన్నారు. అభివృధి పనులలొ రాస్ట్రానికి వచిన 20 అవార్డులు కేంద్రం చేసిన పనుల వల్లే వచ్చాయని, కాని ఏప్పుడూ మేము ప్రచారం కొసం అంగలార్చలేదని ఆయన తెలియజేశారు. రాస్ట్రంలొ కొన్ని శక్తులు, రాస్ట్రంలొ బిజెపి ని భూస్థాపితం చేయాలని ప్రయత్నిస్తున్నాయని కాని అది జరగని పని అని తేల్చి చెప్పారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!