హిందువులు, చైనీస్ ను ఏకం చేస్తున్న “చైనీస్ కాళిమాత దేవాలయం”

Share the Post
#Bharatjago : చైనీస్ నిర్మించిన ఈ కాళి మాత ఆలయాన్ని “చైనీస్ కాళి మందిర్” అంటారు. కోల్‌కతా నగరానికి గుండెకాయలాంటి తంగ్రా ప్రాంతంలొని అతిపెద్ద చైనా టౌన్ లొ ఉన్న ఈ కాళీమాత దేవాలయం, ఈ ఆలయానికున్న ప్రత్యేకతల దృష్ట్యా కోల్‌కతా అంతట ప్రసిద్ధి చెందింది. “ఇసాన్ ఛెన్” అనే 55 ఏళ్ళ చైనీస్ వ్యాపారి ఈ ఆలయానికి ధర్మకర్తగా ఉన్నారు. ఈ కాళీమాత ఆలయంలొ పూజలు పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్దతులలొనే జరుగుతుంటాయి.
.
.
చైనీస్ నిర్వహిస్తున్న ఈ ఆలయంలొ ఉన్న ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే, ఈ కాళి మాతకు నైవేద్యంగా చైనీస్ ఆహారపదార్దలయిన నూడిల్స్, చైనీస్ సూప్, రైస్, కురగాయల వంటకాలను కాళీ మాతకు నైవేద్యంగా (ప్రసాదం) పెడుతుంటారు. ఈ ఆలయంలొ ధూపంగా, ప్రత్యేకమైన చైనీస్ కడ్డీలను వెలిగిస్తుంటారు. ఈ చైనా టౌన్ లొ ఉన్న చైనీస్ అందరూ తప్పని సరిగా ఈ కాళిమాత దేవాలయనికి వచ్చి షూస్ విప్పి కాళి మాతకు ప్రార్ధనలు చేసి ప్రసాదం తీసుకుని తమ పనులకు హాజరవుతుంటారు.
.
.
ఈ ఆలయం నిర్మించక ముందు వరకు కోల్‌కతా లొ అతి పెద్దదయిన ఈ ప్రాంతంలొ చైనీస్, హిందువులకు పెద్దగా సంబందాలు ఉండేవి కాదు. చైనీస్, హిందువుల మద్య కమ్యునికేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఈ ఆలయ నిర్మాణం తరువాత ప్రతిరొజూ హిందువులు, చైనీస్ ఈ ఆలయానికి వస్తుండటంతొ వారి మద్య కమ్యునికేషన్ పెరిగి, స్నేహభావం నెలకుంటుందని ఈ ఆలయ ధర్మ కర్త ఇసాన్ చెన్ తెలియజేశారు.
.
 
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ ఒక చెట్టు క్రింద ఒక చిన్న కాళిమాత విగ్రహం ఉండేదని, అయితే ఒకసారి 10 సంవత్సరాల చైనీస్ బాలునికి తీవ్ర ఆనారొగ్యం కలగడంతొ, అన్ని హాస్పటల్స్ తిరిగినప్పటికీ, డాక్టర్లు తమ వల్ల కాదని చేతులెత్తేయడంతొ, ఆ బాలుని తలిదండ్రులు తమ కుమారుని ఈ కాళీమాత విగ్రహం దగ్గర పడుకొబెట్టి అనేక రొజులు ప్రార్ధనలు చేశారు. ఆశ్చ్యర్యంగా కొద్ది రొజులకు ఆ బాలుడు రొగం నయమయి, మామూలు స్తితికి రావడంతొ, ఇక చైనీస్ అందరూ కాళీ మత భక్తులైపొయారని ఆయన తెలిపారు. ఈ సంఘటన తరువాత ఈ చైనా టౌన్ లొ ఉన్న చైనీస్ అందరూ తలా కొంత చందాలు వేసుకుని కాళీమాత గుడి కట్టామని, ఇందుకొసం ప్రతి చైనా కుటుంబం సహాయం చేసిందని ఆయన తెలియజేశారు.
 
మాలొ ఏక్కువ మంది క్రిస్టియన్లు, బౌద్దులు ఉన్నారు కాని మేమందరం ఈ కాళీమాత భక్తులం, మాకు కాళి పూజ ప్రత్యేకమైనదని, మా జీవితాలలొ ఈ కాళీమాత దేవాలయం ఒక భాగమైపొయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలయంలొ ప్రార్ధనలు చేయడానికి హిందువులు, చైనీస్ వస్తుండటంతొ వారి మద్య దూరం తగ్గి, సత్సంబందాలు ఏర్పడాయని, ముఖ్యంగా దీపావళి రొజున వేల సంఖ్యలొ ప్రజలు వచ్చి ఈ ఆలయంలొ ప్రార్ధనలు చేస్తుంటారని ఆయన తెలియజేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!