సుశీలా కొలి – మనసున్న మహా తల్లి, చదువుల సరస్వతి (Symbol of hope)

Share the Post

#Bharatjago : నాకు పిల్లలకు చదువు చెప్పడం కన్నా మించిన ఆనందం మరొకటి లేదు, ఏందుకంటే చదువు మనిషికి  స్వతంత్ర్యంగా ఏలా బతకాలొ నేర్పుతుంది  — సుశీలా కొలి

ఈ మాటలు చాలు సుశీలా కొలి ఏలాంటి వారొ చెప్పడానికి.  Symbol of hope అనే బిరుదు వచ్చిన సుశీలా కొలి గారు, మహారాస్ట్రలొని కొళ్హాపూర్ జిలాలొని లాట్ అనే చిన్న  గ్రామంలొ నివసించే సాధారణ మహిళ.  అయితే మారుమూల బస్తీ అయిన తమ గ్రామంలొ   చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం గాని, చిన్న పిల్లలకు చదువు చెప్పె స్కూలు గాని  లేకపొవడంతొ,  ఇక పిల్లలకు  పాఠాలు చెప్పి, విద్యా బుద్దులు నేర్పించే భాద్యతను తానే స్వీకరించింది.   అందుకొసం గ్రామస్తుల సహాయం కొరగా, ఏవరు సహాయం చేయకపొగా, అవహేళన చేశారు.

.అటు ప్రభుత్వం నుండి సరయిన సహాయం లేకపొయినప్పటికీ, తన ఇంటిలొనే ఒక అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభించింది.  పిల్లల తల్లితండ్రులు, వారి పిల్లలను పొలాలకు తీసుకు వెళుతుండటంతొ పిల్లలెవరూ స్కూలుకు వచ్చేవారు  కాదు. అయితే సుశీలా కొలి గారు పిల్లలెవరినీ పొలాలకు వెళ్ళనివ్వకుండా ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లల తల్లితండ్రులకు నచ్చ చెబుతూ పిల్లలను స్కూలుకు తీసుకు రావడం ప్రారంభించారు. సుశిలా గారు చదువు చెబుతున్న విధానం చూసిన గ్రామస్తులు, ఇక పూర్తిగా తమ పిల్లలను పొలాలకు తీసుకు వెళ్ళడం మానివేసి, సుశీలా కొలి గారి అంగన్ వాడి కి పంపించడం మొదలుపెట్టారు.

1991 లొ అంగన్ వాడి ప్రారంభించిన సుశీలా కొలీ గారు 2004 వరకు కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా విద్య నేర్పించి తన సామాజిక భాద్యతను గొప్పగా నిర్వహించారు. తరువాత ఆమె చేస్తున్న కృషిని చూసి 2004 లొ మహారాస్ట్ర ప్రభుత్వం ఆమె “అంగన్ వాడి” ని బాల్వాడీ విద్యా మందిర్ గా మార్చివేసి దాని భాద్యతలను  ప్రభుత్వమే చేపట్టింది.

తమ పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నారని, గ్రామస్తులు ఏవరైనా డబ్బులు లేదా గొధుమలు ఇస్తే సుశీలా గారు సున్నితంగా తిరస్కరిస్తూ “నాకు పిల్లలకు చదువు చెప్పడం కన్నా మించిన ఆనందం మరొకటి లేదు, ఏందుకంటే చదువు మనిషికి స్వతంత్ర్యంగా ఏలా బతకాలొ నేర్పుతుంది ” అని చెప్పేవారట.  ఒక మారుమూల పళ్లెటూరిలొ పుట్టిన సుశీలా కొలి గారు, విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యత   చాలా మందికి ప్రేరణ నిచ్చింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!