ఐక్యరాజ్య సమితి భద్రతామండలి లొ పాకిస్థాన్ తొ ఒక ఆట ఆడుకున్న సభ్యదేశాలు

Share the Post
#Bharatjago : తీవ్రవాదం విషయంలొ భద్రతా మండలి సభ్యదేశాలు పాకిస్థాన్ ను మరొకసారి టార్గెట్ చేశాయి. ముఖ్యంగా భారత్, అమెరికా, ఆఫ్గనిస్థాన్ దేశాలు తీవ్రవాదాన్ని పెంచి పొషిస్తున్న పాకిస్థాన్ ను దుయ్యబట్టాయి. పాకిస్థాన్ తన ఆలొచనా విధానాన్ని మార్చుకొవాలని పాకిస్థాన్ కు హితవు పలికాయి.
 
ఈ సమావేశాలలొ పాల్గొన్న ఐక్యరాజ్యసమితి భారత్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ తీవ్రవాదులలొ మంచి తీవ్రవాదులు, చెడ్డ తీవవాదులు అనేది ఉండదని, తీవ్రవాదం తీవ్రవాదమేనని నొక్కి చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే విషయంలో పాక్ ఇకనైనా తన బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. పాకిస్థాన్ లొని తీవ్రవాదం వలన ముఖ్యంగా ఆఫ్గనిస్థాన్ తీవ్రంగా నష్టపొతుందని తెలియజేశారు. ఒకవైపు భారత్, తన మిత్రదేశమైన ఆఫ్ఘనిస్థాన్ లొ శాంతి, రక్షణ, అభివృధి, శ్రేయస్సు కొసం కృషి చేస్తుంటే, కేవలం పాకిస్థాన్ పెంచిపొషిస్తున్న సరిహద్దు తీవ్రవాదం వలన తమ ప్రయత్నాలన్నీ నీరుగారి పొతున్నాయని దుయ్యబట్టారు.
.
.
ఈ సమావేశాలలొ పాల్గొన్న అమెరికా ప్రతినిధి జాన్ సులివాన్ మాట్లాడుతూ పాకిస్థాన్, తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉండటానికి అంగీకరించే పరిస్తితే లేదు. తీవ్రవాదంపై ఏటువంటి చర్యలు తీసుకొవాలనే విషయంలొ పాకిస్థాన్ త్వరగా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సరిహద్దు తీవ్రవాదంపై ఖటిన చర్యలు తీసుకొవాలి లేకపొతే పాకిస్థాన్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
 
ఈ సమావేశాలలొ పాల్గొన్న అఫ్గనిస్థాన్ ప్రతినిధి ఖలీల్ ఖర్జాయ్ మాట్లాడుతూ పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు. ఒక పక్క సరిహద్దు తీవ్రవాదాన్ని పెంచి పొషిస్తూ, మరొక పక్క తమ దేశంలొ తీవ్రవాదం లేదని చెప్పుకునే పనిలొ పాకిస్థాన్ బిజిగా ఉందని తెలియజేశారు. గత రెండు సంవత్సరాల నుండి తీవ్రవాద కార్యకలాపాలు పెచ్చు మీరాయని, దీని వలన ఆఫ్గనిస్థాన్ వృద్ధి రేటు దారుణంగా పడిపొతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాగా ఈ విషయంలొ భద్రతామండలి లొని దేశాలన్నీ పాకిస్థాన్ ను తప్పు పట్టినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలొ పాకిస్థాన్ కు సపొర్టు చేస్తే పరువు పొతుందని భావించిన చైనా, ఏం మాట్లాడకుండా కూర్చుందిట.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!