వ్యతిరేకులు కూడా జై కొట్టే సమాధానాలు ఇచ్చిన మోదీ,జీన్యూస్ ఇంటర్వ్యూ.
మోదీగారు జీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలు
#BharatJago: ప్రపంచ నేతల పక్కన ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ ఉన్నది నరేంద్ర మోదీ కాదు 125 కోట్ల భారతీయుల ప్రతినిధిగా నిలబడుతున్న భావన ఉంటుంందని అన్నారు.
నా దేశం నన్ను పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను, నా నుండి ఎంత కావాలంటే అంత తీసుకోండి,నేను నా సంపూర్ణ శక్తితో పని చేయడానికి సిద్దంగా ఉన్న.
నేను నా సంపూర్ణ శక్తిని ప్రజల కోసం ఉపయోగిస్తున్నానని, ఇది భగవంతుడు నాకు ఇచ్చారు, ఇది నా భాద్యత కూడ.నేను పనిచేసే విధానం మంచిది కాదు అని వైద్యులు ఎప్పుడు చెబుతుంటారు, కొంత సమయానన్నా ఆలోచించటానికి కేటాయించాలి అని చెప్పారు,కాని అది నా అలవాటుకాదు . నేను తప్పనిసరిగా పని చేసి తీరాల్సిందే .నా శక్తికి కారణం ప్రజల దీవెనలేనని చెప్పారు.
తన శరీరంలోని ప్రతి అణువు దేశానికి రుణపడి ఉందని,దేశంలోని ప్రజలకు సేవచేస్తూ ఉండాలి అని
కోరుకుంటున్నానని చెప్పారు.ప్రజల కళ్ళలో సంతృప్తి చూసినప్పుడు నాకు శక్తినిస్తుందని తెలియజేశారు
పారిస్ వాతావరణ ఒప్పందంపై భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషించింది.
ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకోవడం తన ప్రాథమిక స్వభావమని అన్నారు.
బడ్జెట్ వెనుక తమ సర్కారుకి వున్న ప్రధానమైన అజెండా కేవలం అభివృద్ధి మాత్రమే.
“బ్యాంకుల జాతియీకరణ తర్వాత 30-40 శాతం జనాభాకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి సంబంధాలు తెగిపోయాయి. తమ ప్రభుత్వం మళ్లీ వారిని బ్యాంకింగ్ రంగానికి చేరువ చేసింది. అందులో వారిని భాగస్వాములని చేసింది. అటువంటప్పుడు అది విజయం కాదా” అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. ” పాఠశాల ప్రాంగణాలలో మరుగుదొడ్లు లేని కారణంగా వేల మంది ఆడ పిల్లలు చదువుకు దూరమయ్యారు. తమ సర్కారు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించి, అన్ని సౌకర్యాలు సమకూర్చింది. అది ప్రభుత్వం సాధించిన విజయం కాదా” అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
జీ న్యూస్ ప్రశ్న: ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటున్నారు..దీన్నుంచి ఏం కోరుకుంటున్నారు ?
జవాబు: ఇలాంటి ప్రశ్న వేసినందుకు జీ న్యూస్‌కు ధన్యవాదాలు..దీన్ని లాజిస్టిక్ దృష్టితో చూడాలి…ప్రస్తుతం దేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైన ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎప్పుడు ఏం చేయాలన్న ఎన్నికల దృష్టితో చూస్తున్నారు. ఎన్నికల కోసమే పనిచేయాల్సి వస్తుంది తప్పితే …ప్రజల కోసం పనిచేయడం లేదు. ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదు. వీటికి మొత్తానికి సొల్యూషన్ ఒకటే..అది ‘ ఒకే దేశం ఒకే ఎన్నికలు’.
వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశ ధనం భారీ స్థాయిలో వృధాగా ఖర్చు అవుతోంది..దీనికి తోడు దేశ రక్షణలో నిమగ్నమై ఉండాల్సిన సైనికులు, శాంతి భద్రతలు పరిరక్షించాల్సింది పోలీసులు ఎన్నికల డ్యూటీలో నిమగ్నమౌతున్నారు..ఇది ఏమాత్రం మంచి విధానం కాదు..అందుకే ఒకే నేషన్ ఒకే ఎన్నికలను అమలు చేయాలని భావిస్తున్నాం
ప్ర: 2014 నుంచి ఇప్పటికీ భారత ప్రతిష్ఠ ఏమైనా పెరిగిందని భావిస్తున్నారా ?
ప్రధాని జవాబు: భారత్ కు ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠ ఉంది..కానీ ఇప్పుడు దాని ప్రతిష్ఠ మరింత పెరిగింది. అదేలాగంటే ఒకప్పుడు భారత దేశం మిత్రల కోసం వెంటాడుతూ ఉండేది కానీ ఇప్పుడు భారత్ తో స్నేహం కోసం అంతర్జాతీయ సమాజం ఎదురుచూస్తోంది.
Super always modi ji great Jai bjp