Major Blow to China : చైనా కు ఊహించని పెద్ద షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్

Share the Post
#Bharatjago : దక్షిణాసియా మొత్తాన్ని గుప్పిటలొ బంధించాలని చూస్తున్న చైనాకు, బంగ్లాదేశ్ ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆసియాలొ శ్రీలంక, పాకిస్థాన్, మాల్దీవులకు చైనా పెద్ద ఏత్తున ఋణాలు ఇచ్చి, పెద్ద ఏత్తున పొర్టులు, కారిడార్లు నిర్మించి, తిరిగి వాటిని తమ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలతొ భయపడిన బంగ్లాదేశ్ మొత్తానికి చైనా పీడ వదిలించుకొవడం ప్రారంభించింది. మొదటి దెబ్బగా చైనాలొని అతి పెద్ద నిర్మాణ సంస్థ అయిన “చైనా హార్బర్ & ఇంజనీరింగ్ కంపెనీ” ని Blacklist లొ పెట్టి చైనాను ఊహించని దెబ్బ కొట్టింది.
 
2016 లొ చైనా అధ్యక్షుడు క్సింపింగ్, బంగ్లాదేశ్ పర్యటన సంధర్బంగా చైనా, బంగ్లాదేశ్ కు 21.5 బిలియన్ డాలర్ల ఋణాలు ఇచ్చేటట్టు, మరలా చైనా కంపెనీలే ఆ ఋణాలను బంగ్లాదేశ్ లొని రవాణా వ్యవస్థలపై, పొర్టులపై, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు పెట్టనున్నట్టు ఇరు దేశాల మద్య ఒప్పందం కుదిరింది (అప్పట్లొ ఇదొక చారిత్రాత్మక పర్యటనగా బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది).
 
ఇందులొ భాగంగా చైనా హార్బర్ & ఇంజనీరింగ్ కంపెనీ, ఢాకా_సైళత్ నగరాల మద్య 230 కిలొమీటర్ల Express Highway నిర్మాణ భాద్త్యతలు స్వీకరించింది. (పాకిస్థాన్ లొని గ్వాదర్ పొర్టును, శ్రీలంకలొని హంబతొట పొర్టులను నిర్మించింది కూడా ఈ కంపెనీయే). అయితే ఈ మెగా రొడ్డు నిర్మాణాన్ని, ఈ చైనా కంపెనీ బంగ్లాదేశ్ చెప్పినట్లు కాకుండా, తమకు (చైనా కు) అనుకులంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. Goal Post లను పూర్తిగా మర్చివేసింది. ఈ విషయంలొ నొరెత్తకుండా ఉండటానికి బంగ్లాదేశ్ అధికారులకు పెద్ద ఏత్తున లంచం ఇవ్వజూపింది.
 
ఈ సంఘటనతొ బిత్తరపొయిన బంగ్లాదేశ్, ఇప్పటికే శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్ పరిస్తితులను ప్రత్యక్షంగా చూసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, అవకాశం దొరకడంతొ వెంటనే ఈ కంపెనీను బ్లాక్ లిస్టులొ పెట్టేసింది. పారాదీప్ పొర్టు నిర్మాణాన్ని కూడా ఈ కంపెనీయే చేపడుతుండటంతొ ముందుగా మేల్కొని ఈ కంపెనీను బ్లాక్ లిస్టు లొ పెట్టి చైనాకు పెద్ద Punch ఇచ్చింది.  ఈ విషయం గురించి బంగ్లాదేశ్ ఆర్ధిక మంత్రి అబ్డుల్ ముహిత్ మాట్లాడుతూ బ్లాక్ లిస్ట్ అంటే బ్లాక్ లిస్టే, దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని ఖటినంగా జవాబిచ్చారు. 
 
ఈ ఊహించని పరాభవంతొ, ఈ సంఘటనపై స్పందించడానికి సిగ్గు పడి చైనా ముఖం చాటేసింది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!