ధొక్లాం సరిహద్దుల వద్ద చైనా స్థావరాలు నిర్మించడంతొ, చైనాకు దిమ్మతిరిగే సమాధానమివ్వనున్న భారత్

Share the Post
#Bharatjago : ధొక్లాంలొ 72 రొజుల Military standoff తరువాత కూడా చైనా బుధి తెచ్చుకొకుండా, ధొక్లాం లొ కానప్పటికీ ధొక్లాం వివాదాస్పద ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలొ చైనా భూభాగంలొ చైనా రహస్యంగా సైనిక స్థావరాలు నిర్మించడంతొ, చైనాకు సరయిన జవాబు (Befitting reply)   ఇచ్చేందుకు భారత్ సర్వం సిధం చేసింది.
 
ఏప్పటికైనా ధొక్లాంలొ చైనాతొ ఇబ్బందులు తప్పవని ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిన మోది ప్రభుత్వం, ఇక ధొక్లాం వద చైనా ను ఏదుర్కొనే చర్యలు ప్రారంభించింది. ఇందులొ భాగంగా 12,000 మంది భారత ప్రత్యేక దళాలతొ కూడిన 15 బెటాలియన్లను సిక్కిం, అరుణాచలప్రదేశ్ సరిహద్దుల వద్దకు తరలిస్తుంది. ఏటువంటి పరిస్తితులనైనా ఏదుర్కొనేందుకు వీలుగా ఈ బెటాలియన్లకు అత్యంత అధునాతన ఆయుధాలతొ సహా పెద్ద మొత్తంలొ మిలటరీ ఏక్విమెంట్ ను అందిస్తుంది.
 
దీనితొ పాటుగా ధొక్లాం సరిహద్దుల వద్దకు తరలించేందుకు వీలుగా, భారత్ స్వదేశీ పరిగ్ణానంతొ తయారు చేసిన 155 mm హొవిడ్జర్లను (ATAGS) మొదటిసారి సిక్కింలొనే పరీక్షించనుంది. ఇక్కడ ఈ పరీక్షలు నిర్వహించిన తరువాత ధొక్లాంలొ వీటిని మొహరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హొవిడ్జర్లు ఏకంగా 48 కిలొమీటర్ల దూరం Fire చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 15 సెకన్లలొ మూడు రౌండ్లు ఫైర్ చేయగల సామర్ధ్యం ATAGS సొంతం.
.
.
అంతేకాకుండా, ఇక్కడ పెద్ద ఏత్తున మౌళిక సదుపాయాలు కలించి, ఏటువంటి పరిస్తితులనైనా ఏదుర్కొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనుండటం విశేషం. రెండు రొజుల క్రితం విజయవంతంగా పరీక్షించిన అగ్ని-5 మిసైల్, చైనాను హెచ్చరించేందుకు మాత్రమే పరీక్షించినట్టు తెలుస్తుంది. చైనా లొని ఏప్రాంతానైనా చేరుకుని ద్వంసం చేయగల సత్తా అగ్ని-5 సొంతం.
 
అయితే ఈ విషయం గురించి భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ గారు మాట్లాడుతూ చైనా నిర్మించింది తాత్కాలిక నిర్మాణాలేనని, ధొక్లాం సంఘటన తరువాత ఆ ప్రాంతంలొ అంతకు ముందు కంటే చైనా సైనికులు తక్కువగా ఉన్నారని తెలియజేశారు. ఈ నిర్మాణాల వలన భారత్ కు పెద్ద ఇబ్బందులేవి తలెత్తవని, అయితే ఇటువంటి పరిస్తితులలొ ముందు జాగ్రత్తగా ఏటువంటి పరిస్తితులనైనా ఏదుర్కొనెందుకు సిధంగా ఉన్నామని పేర్కొన్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!