జయహొ భారత్ : మరొక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కూటమిలొ చేరిన భారత్

Share the Post
#Bharatjago : ఇప్పటికే   ప్రపంచ   ప్రఖ్యాత MTCR , వాసెనార్ (Big Boys) గ్రూఫులలొ చేరిన భారత్, నిన్న మరొక అంతర్జాతీయ కూటమి అయిన ఆస్ట్రేలియా గ్రూఫ్ (AG) లొ చేరింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ప్రాన్స్, ఇటలీ, జపాన్ లాంటి మొత్తం 42 అభివృధి చెందిన దేశాలున్న ఈ ఆస్ట్రేలియా గ్రూఫ్ లొ 43 వ దేశంగా భారత్ హుందాగా అడుగు పెట్టింది. ఈ గ్రూఫ్ లొ చేరడం ద్వారా భారత్ కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రుఫ్ (NSG) లొ చేరేందుకు అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.
 
ప్రధానంగా జీవ, రసాయన ఆయుధాలకు వ్యతిరేకంగా పనిచేసే ఈ అంతర్జాతీయ కూటమిని 1985 లొ ఏర్పాటు చేశారు.
.

 
 
1984 లొ ఇరాక్_ఇరాన్ యుద్ధంలొ, ఇరాక్ కెమికల్,బయోలాజికల్ ఆయుధాలు ఉపయొగించడంతొ, తరువాతి సంవత్సరమే ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కూటమి కెమికల్, బయోలాజికల్ ఆయుధాలను ప్రపంచంలొ ఏ ఇతర దేశాలు తయారుచేయకుండా నిరొధిస్తుంది. తీవ్రవాదుల చేతిలొకి ఈ ఆయుధాలు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఆయా దేశాలకు ఈ ఆయుధాలు తయారుచేయడానికి కావలసిన టెక్నాలజీని, మెటీరియల్, ఇతర ఏక్విప్మెంట్ ను అందకుండా చేయడంలొ కీలక పాత్ర పొషిస్తుంది. ఒక వేళ పాకిస్థాన్ లాంటి ఏ దేశమైనా ఈ ఆయుధాలను తయారుచేస్తున్నట్లయితే ఈ కూటమిలొని సభ్యదేశాలకు ఆ దేశం పై ఆంక్షలు విధించి, చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.
 
ముఖ్యంగా ఈ కూటమిలొ చేరడం వలన భారత్ కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూఫ్ లొ చేరే అవకాశాలు మరింత మెరుగు పడ్డాయి. ముఖ్యంగా పాకిస్థాన్ జీవ, రసాయన ఆయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్న ఈ సమయంలొ భారత్, ఈ కూటమి లొ చేరడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఈ ప్రిస్టేజియస్ కూటమిలొ చేరడానికి భారత్ కన్నా ముందు నుండి చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇంతవరకు ఈ కూటమిలొ చైనా స్థానం సంపాదించక పొవడం విశేషం. ఇప్పుడు ఈ కూటమిలొ భారత్ చేరడంతొ చైనాకు ఈ కూటమిలొ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపొయాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!