Big News : హఫీజ్ సయ్యద్ పై గురిపెట్టిన అమెరికా

Share the Post
#Bharatjago : ఇప్పటి వరకు తీవ్రవాదులపై చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ పై అమెరికా బలంగా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తీవ్రవాదుల పై ఖచ్చితమైన చర్యలు తీసుకునేంత వరకు పైసా కూడా సహాయం చేసేదిలేదని పాకిస్థాన్ కు ఇచ్చే 13,000 కొట్ల ఆర్ధిక సహాయాన్ని అమెరికా నిలిపి వేసింది. అయితే మొన్న పాకిస్థాన్ విదేశాంగశాఖా మంత్రి మాట్లాడుతూ హఫీజ్ సయ్యద్ పై ఏటువంటి కేసులు గాని, ఆధారాలు కాని లేవని అందువలన హఫీజ్ సయ్యద్ పై ఏటువంటి చర్యలు తీసుకొలేమని ఒక మీడియా ఇంటర్యూ లొ తెలియజేశారు.
 
దీనితొ ఒళ్ళుమండిన అమెరికా, పాకిస్థాన్ పై విరుచుకుపడింది. హఫీజ్ సయ్యద్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకొవాల్సిందేనని, చట్టప్రకారం ఆతనికి శిక్ష (ఉరి శిక్ష  ) విధించాల్సిందేనని పాకిస్థాన్ కు తేల్చిచెప్పింది.
 
ఈ సంధర్బంగా అమెరికన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి “హేథెర్ నౌరత్” మాట్లాడుతూ “హఫీజ్ సయ్యద్ ఒక అంతర్జాతీయ తీవ్రవాది. అతనికి ఆల్ ఖైదా, లష్కరే తొయబాల తొ నేరుగా సంబందాలు కలిగిఉండి సహాయం చేస్తుండటంతొ సెక్షన్ 1267 ప్రకారం ఐక్యరాజ్య సమితి సెక్యురిటీ కౌన్సిల్ హఫీజ్ సయ్యద్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది. 160 మందికి పైగా చనిపొయిన 2008_ముంబయి దాడులకు హఫీజ్ సయ్యద్ ప్రధాన సూత్రదారి. మేము పాకిస్థాన్ కు స్పష్టంగా చెబుతున్నాము హఫీజ్ సయ్యద్ ను చట్టప్రకారం శిక్షిచవలసిందే” అని కుండబద్దలు కొట్టారు.
.
.
పాకిస్థాన్ తీవ్రవాదులపై చర్యలు తీసుకున్నట్టు మాకు ఇంతవరకు ఏటువంటి స్పష్టమైన రిపొర్టు రాలేదు. ఒకవేళ పాకిస్థాన్, తీవ్రవాదం పై చర్యలు తీసుకొకపొతే పాకిస్థాన్ ఏటువంటి పరిణామాలు ఏదుర్కొవాల్సి వస్తుందొ ఇంతకుముందే పాకిస్థాన్ కు తెలియజేశాము. అనేక తీవ్రవాద కార్యకలపాలు కొనసాగిస్తున్న హఫీజ్ సయ్యద్ ను వదిలేది లేదని అమెరికన్ అధికార ప్రతినిధి హేథెర్ నౌరత్  తీవ్రస్థాయిలొ   హెచ్చరించారు.
.
 

One thought on “Big News : హఫీజ్ సయ్యద్ పై గురిపెట్టిన అమెరికా

  • January 19, 2018 at 7:53 am
    Permalink

    USA.. Has to take more action on this..letthey go to pak… And do investgate same..or need to change un strategy

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!