Superb News : ఇజ్రాయిల్ ప్రధాని రాకతొ మళ్ళీ పట్టాల కెక్కిన “స్పైక్ మిసైల్స్” ఒప్పందం

Share the Post
#Bharatjago : కొద్ది రొజుల క్రితం ఇజ్రాయిల్ కు చెందిన రాఫెల్ డిఫెన్స్ కంపెనీతొ Spike Anti-tank guided missiles కొసం భారత్ చేసుకున్న 500 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే … అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహ్ భారత పర్యటన సంధర్బంగా మరలా ఈ “స్పైక్ యాంటి ట్యాంక్ మిసైల్స్ డీల్” మళ్ళీ పట్టాల కెక్కింది.
.
 
321 యాంటి ట్యాంక్ మిసైల్ లాంచర్లు, 8,356 మిసైల్స్ ను భారత్ లొనే Make In India లొ తయారుచేసే విధంగా, అలాగే దానికి సంబందించిన టెక్నాలజీ ని కూడా భారత్ కు అందించే విధంగా భారత ప్రభుత్వం 2016 లొ ఇజ్రాయిల్ కంపెనీ రాఫెల్ తొ ఒప్పందం కుదుర్చుకుంది. తరువాత రాఫెల్ కంపెనీ దీనికి సంబందించిన యూనిట్ ను హైదరాబాదు లొ ప్రారంభించింది. అయితే హఠార్తుగా రాఫెల్ కంపెనీ U Turn తీసుకుని, ATGM టెక్నాలజీ ని భారత్ కు అందించడానికి అంగీకరించక పొవడంతొ, భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా ఈ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ను తయారు చేసే భాద్యతను DRDO కు అప్పగించింది. (అయితే వీటి తయారీకి సంబందించిన పూర్తి టెక్నాలజి తమ వద్ద లేకపొవడంతొ, ఈ ప్రాజెక్టు ఏక్కువ సమయం తీసుకుంటుందని DRDO తెలియజేసింది).
.
 
అయితే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహ్ భారత పర్యటనలొ మరలా చర్చలు జరిపిన ఇరుదేశాలు, ఈ మిసైల్స్ కు సంబందించిన టెక్నాలజీని భారత్ కు అందివ్వడానికి ఇజ్రాయిల్ ప్రధాని అంగీకరించడంతొ, భారత్ మరలా ఈ ఒప్పందం చేసుకొవడానికి సిధమైంది. అయితే భవిష్యత్తులొ ఏటువంటి ఆటంకాలు కలుగకుండా, ఈసారి రాఫెల్ కంపెనీతొ కాకుండా నేరుగా ఇజ్రాయిల్ ప్రభుత్వంతొ, భారత ప్రభుత్వం Government to Government ఒప్పందం చేసుకొనుండటం విశేషం.
.
 
కాగా ఈ స్పైక్ యాంటి ట్యాంక్ మిసైల్స్ ” Fire & Forget Missiles” . అంటే ఒక్కసారి Fire చేస్తే, ఇక టార్గెట్ గురించి మర్చిపొవలసిందే. లక్ష్యాలను ఖచ్చితంగా ద్వంసం చేస్థాయి. నాలుగు కిలొమీటర్ల పరిధిలొ ఏటువంటి యుధ ట్యాంకులనైనా, సెకన్ల వ్యవధిలొ ద్వంసం చేయగల సత్తా వీటి సొంతం.
.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!