ఇజ్రాయిల్_భారత దేశాల మైత్రీ బంధంతొ బెదిరి చస్తున్న పాకిస్థాన్, కాళ్లబేరానికి వచ్చే అవకాశం !!!

Share the Post
#Bharatjago : ఏంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు, ఇజ్రాయిల్_భారత దేశాల మైత్రీ బంధం పాకిస్థాన్ చావు కొచ్చింది. ఆరు నెలల క్రితం భారత ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన చేసినప్పుడే, తన మనసులొ ఉన్న భయాన్ని బయటపెట్టిన పాకిస్థాన్ … ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహ్ భారత్ లొ పర్యటిస్తుండటం, దీనికి తొడు ఇక నుండి ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లు కలిసి పనిచేయనుండటంతొ పాకిస్థాన్ మరింత బెదిరి చస్తుంది. దీనికి తొడు వాస్తవాధీన రేఖ వద్ద ఇండియన్ అర్మీ, పాకిస్థాన్ సైనికుల తాట తీస్తుండటంతొ పాకిస్థాన్, కాళ్ల బేరానికి (రాజి మార్గానికి) రావడానికి సిధమయినట్లు తెలుస్తుంది.
 
ప్రస్తుతం ఘర్షణ వాతావరణాన్ని కొంతైనా తగ్గించేందుకు, భారత్_పాకిస్థాన్ దేశాల మద్య కాల్పుల విరమణ పాటించేలా కొత్త ప్రతిపాదనలు చేయడానికి పాకిస్థాన్ ముందుకు వచ్చింది. ఈ విషయంపై నిన్న పాకిస్థాన్ డిఫెన్స్ కౌన్సిల్ సమావేశంలొ చర్చించిన పాకిస్థాన్ ఆర్మీ అధికారులు, నాలుగు సంవత్సరాల తరువాత మొదటిసారి భారత్_పాకిస్థాన్ దేశాల మద్య డీజీఎంఓ (డైరక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) స్థాయి సమావేశం జరపాలని భారత్ ను కొరడానికి పాకిస్థాన్ నిర్ణయించుకుంది. తద్వారా భారత్ తొ రాజీ మార్గానికి రావడం ద్వారా పరిస్తితులను కొంతవరకు చల్లబరచవచ్చేనే ఆలొచనలొ పాకిస్థాన్ ఉన్నట్టు తెలుస్తుంది.
 
అయితే పాకిస్థాన్ విషయంలొ మోది ప్రభుత్వం ఖటిన వైఖరినిి అవలంబిస్తుండటం, దీనికి తొడు ఇజ్రాయిల్, భారత్ తొ చేతులు కలపడం, పైగా ఈ రెండు దేశాలకు అమెరికా అందదండలు పుష్కలంగా ఉండటంతొ తాము చేసే రాజి ప్రతిపాదనలకు మోది ప్రభుత్వం అంగీకరిస్తుందొ లేదొనన్న అనుమానాలు పాకిస్థాన్ ను పట్టిపీడిస్తున్నాయి.
 
దీనితొ పాకిస్థాన్, ఒకవైపు రాజీ మార్గానికి తలుపులు తెరుస్తూ, మరొకవైపు మేకపొతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. నిన్న పాకిస్థాన్ విదేశాంగమంత్రి “ఖావాజ ఆసిఫ్” మాట్లాడుతూ, ఇజ్రాయిల్_భారత్ దేశాల కూటమిని ఏదుర్కొనగల సత్తా పాకిస్థాన్ కు ఉందని కామెడీ చేశారు. రెండు దేశాల మద్య జరుగుతున్న ఒప్పందాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, రెండు దేశాలు ముస్లిం ప్రాంతాలను ఆక్రమించిన దేశాలేనని పేర్కొన్నారు. తమది శాంతియుత దేశమని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏన్నొ పొరాటాలు చేశామని, ఏవరైనా తమ జొలికొస్తే సహించేది లేదని తన మసులొ ఉన్న భయాన్ని బయటపెట్టాడు.
.
 
ఏదైనాగాని పాకిస్థాన్ విషయంలొ భారత్ ఏటువంటి వైఖరిని అవలంబిస్తుందనేది మరికొద్ది రొజులలొ తెలియనుంది.
.

One thought on “ఇజ్రాయిల్_భారత దేశాల మైత్రీ బంధంతొ బెదిరి చస్తున్న పాకిస్థాన్, కాళ్లబేరానికి వచ్చే అవకాశం !!!

  • January 19, 2018 at 2:50 am
    Permalink

    మీతో చర్చలు జరపాలంటే 1. అక్రమిత కాశ్మీర్ నుంచి వైదోలుగుతు చైనాకు లీజుకు లేదా గిఫ్ట్ గా ఇచ్చిన అక్రమిత కాశ్మీర్ భూభాగం తో కలిపి భారతదేశానికి అందచేయ్యాలి 2. పాకిస్తాన్ లో ఉన్న బలవంతంగా మార్చిన హిందువులకు పునర్ వైభవం తీసుకోనిరావాలి 3.బలూచిస్తాన్ ప్రజలకు వారి గౌరవాన్ని కాపాడగలుగుతాం అనే నమ్మాకాన్ని దైర్యాన్ని ఇవ్వాలి 4. టెర్రరస్టుల శిక్షణ కేంద్రాలు స్థావరాలు ద్వంసం చేయాలి 5.గ్వాదార్ నౌకాశ్రయానికి భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ఏవ్వరికి ఇవ్వరాదు 6. పాకిస్థాన్ ఇతర దేశాలతో ఏవైనా ఒప్పందాలు చేసుకోవాలంటే భారతదేశ అనుమతి తీసుకోవాలి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!