మొన్న అరుణాచలప్రదేశ్ లొ చైనీస్ ను “ఢీ” కొట్టడానికి భారత సైనికులు ఏంత కష్టపడ్డారొ తెలుసా ??

Share the Post
#Bharatjago : అరుణాచలప్రదేశ్ లొని సరిహద్దు వెంబడి ఉన్న టూటింగ్ ప్రాంతంలొకి చైనీస్ ప్రవేశించి అక్కడ రొడ్దు నిర్మాణం చేపడుతుండగా, అక్కడి స్థానికులు చూసి ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ కి తెలియజేయడంతొ, వెంటనే ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకుని చైనీస్ రొడ్డు నిర్మాణాన్ని అడ్డుకుని, వారి వాహనాలను, పరికరాలను సీజ్ చేసి, వారిని వెనక్కు పంపిన సంగతి తెలిసిందే.
 
అయితే ఇండియన్ ఆర్మీ, చైనీస్ రొడ్డు నిర్మాణం చేపడుతున్న ఆ ప్రాంతానికి వెళ్ళడానికి 15 కేజీల లగేజితొ 19 గంటల పాటు కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుని ఆప్రాంతానికి చేరుకొవాల్సి వచ్చింది. చైనీస్ రొడ్డు నిర్మాణం చేపడుతున్న టుటింగ్ ప్రాంతానికి రొడ్డు రవాణా సదుపాయలు లేకపొవడంతొ భారత సైనికులు తమ రైఫిల్స్, మందుగుండు, ఇతర సామాగ్రిని తీసుకుని దాదాపు 15 కేజీల లగేజి తొ నిరాటంకంగా 19 గంటలు నడిచి పర్వతాన్ని దాటుకుని ఆ ప్రాంతానికి చేరుకొవాల్సి వచ్చింది.
 
చైనీస్ రొడ్డు నిర్మాణం చేపడుతున్నారని, డిసెంబరు 28 న సమాచారం రావడంతొ, వెంటనే రక్షణశాఖ, 120 మంది సైనికులను ఆ ప్రాంతానికి తరలించమని, కనీసం అక్కడ 30 రొజులు ఉండటానికి అవసరమయ్యే తిండి, నీరు, ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకొమని ఆదేశాలు జారీ చేసింది. (ఇంతకు ముందు ధొక్లాంలొ 72 రొజులపాటు జరగడంతొ రక్షణశాఖ ముందు జాగ్రత్తగా భారత సైనికులు కనీసం 30 రొజులు ఉండేలా ఏర్పాట్లు చేసుకొమని ఆదేశించింది)
 
అయితే 120 మంది సైనికులకు 30 రొజులపాటు సరిపడా ఆహరం, నీరు, ఇతర సామాగ్రి తీసుకువెళ్ళడమంటే మాటలు కాదు. ఒక్కొక్క సైనికునికి, ఒక రొజుకు ఆహారం, నీరు, కిరొసిన్ లను కలుపుకుని సుమారు 1.5 కేజీల రేషన్ అవసరమవుతుంది. దీనితొ ఆహారం, నీరు, కిరొసిన్ లను ఆ ప్రాంతానికి చేర్చడానికి 300 మంది పొర్టర్లను పిలిపించారు. ఒక్కొక్క పొర్టర్ 15 కేజీల సామాగ్రిని తీసుకుని మొత్తం 300 మంది పొర్టర్లు , దాదాపు అంతే మొత్తం లగేజిని తీసుకుని భారత సైనికులు ప్రయాణం ప్రారంభించారు. దీనితొ పాటుగా ఇండియన్ ఏయిర్ ఫొర్స్ ముందు జాగ్రత్తగా 120 మంది సైనికులు వెళుతున్న దారిలొ Ready-to-eat meals Packets, 30,000 చాక్లెట్లను (శక్తి కొసం) జారవిడించింది.
 
మొత్తంగా ఏన్నొ ప్రయాసల కొర్చి, ఏంతొ కష్టపడి ఆప్రాంతానికి చేరుకున్న భారత బలగాలు చైనీస్ రొడ్డు నిర్మాణాలను అడ్డుకుని, వాహనాలను సీజ్ చేసి, చైనీస్ ను తొకముడిచేలా చేయడంలొ  గొప్ప  విజయం సాధించారు.
 
కాగా ప్రస్తుతం మోది ప్రభుత్వం,  సైనిక అవసరాల కొసం    చైనా సరిహద్దుల వద్ద నిర్మిస్తున్న  మొత్తం  72 రహదారులలొ ఈ ప్రాంతం కూడా ఉంది. మరొక 10 నెలలలొ ఇక్కడ రొడ్డు మార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. 
.

One thought on “మొన్న అరుణాచలప్రదేశ్ లొ చైనీస్ ను “ఢీ” కొట్టడానికి భారత సైనికులు ఏంత కష్టపడ్డారొ తెలుసా ??

  • January 17, 2018 at 1:57 pm
    Permalink

    I salute those soldiers for their uphill task, your valour is unmatchable

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!