తెల్లని పంచె, మెడలొ అంగవస్త్రం, సిల్క్ చొక్కా వేసుకుని అచ్చు హిందూ వేషధారణలొ ఉన్న ఇతనేవరొ తెలుసా

Share the Post
#Bharatjago : తెల్లని పంచె కట్టుకుని, మెడలొ అందమైన అంగవస్త్రం (కండువా) వేసుకుని, పచ్చని సిల్కు చొక్కా ధరించి అచ్చు హిందూ సాంప్రదాయ దుస్తులను ధరించి ధగ ధగ మెరిసి పొతున్న ఇతను సాక్ష్యాత్తూ కెనడా ప్రధానమంత్రి “జస్టిన్ ట్రుదేవు”. మొన్నటి సంక్రాంతి పండగ సంధర్బంగా, కెనడా లొని తమిళ హిందువులు టొరంటొ లొ నిర్వహించిన కార్యక్రమంలొ పాల్గొన్న కెనడా ప్రధాని, మన సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయి సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుదేవు, ఈ సంధర్భంగా తమిళులకు ” “Iniya Thai Pongal Nalvazhthukkal” అంటూ తమిళ భాషలొ సంక్రాంతి విషెస్ చెప్పడం విశేషం.
.
 
మొదటి నుండి హిందూమతం పై గౌరవం కలిగి ఉన్న ప్రధాని ట్రుదేవు, హిందువుల పండగయిన సంక్రాంతి పర్వదినం సంధర్బంగా వారం క్రితమే , ఏకంగా మూడు భాషలలొ (ఇంగ్లీషు, ఫ్రెంచ్, తమిళ్) సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
.
 
2017, అక్టొబర్ లొ నల్లని షేర్వాని ధరించి, ఓట్టావా లొ దీపావళి ఉత్సవాలు ప్రారంభించిన ఫొటొలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఏత్తున వైరల్ అయ్యాయి. దీనితొ పెద్ద సంఖ్యలొ భారతీయులు ట్రూదేవు అభిమానుల జాబితాలొ చేరిపొయారు 
.
 
కాగా “ఆంగస్ రెయిడ్ ఇనిస్ట్యుట్ & ఫైత్” అనే సంస్థ చేసిన సర్వేలొ 32% మంది కెనడియన్లు, కెనడ ప్రజల జీవన విధానంలొ హిందూయిజం ప్రభావం పెరుగుతుందని చెప్పగా, 13% మంది కెనడియన్లు హిందుమతం వలన ప్రయోజనం ఉందని చెప్పడం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!