జయహొ భారత్ : దావొస్ ప్రపంచ సదస్సులొ ప్రారంభం కానున్న మోది హవా

Share the Post
#Bharatjago : భారత ప్రధాని నరేంద్ర మోది కి మరొకసారి, మరొక అరుదైన గౌరవం దక్కింది. స్విడ్జర్లాండ్ లొని దావొస్ లొ ప్రతి సంవత్సరం జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (World Economic Forum) ఈ నెల 23 – 26 వరకు జరగనుంది.  వరల్డ్ బ్యాంక్, WTO, IMF లాంటి 38 అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సంస్థలతొ సహా , ప్రపంచ దేశాలకు చెందిన దాదాపు 3,000 మంది CEO లు , ప్రతినిధులు, దేశాధినేతలు పాల్గొనే ఈ సదస్సుకు మొదటిసారి భారత ప్రధాని ముఖ్య అతిధులలొ ఒకరిగా  ఆహ్వానించబడటమే కాకుండా (ఇంతకు ముందు ఈ సదస్సులొ భారత ప్రధానిగా దేవగౌడ పాల్గొన్నప్పటికీ, ఆయన ముఖ్య అతిధిగా ఆహ్వానించబడలేదు), ఈ సదస్సులొ మొదటి ప్రసంగం మోది గారితొ ప్రారంభించనుండటం విశేషం. అంటే ఈ సదస్సులొ ప్రారంభొపన్యాసం భారత ప్రధాని నరేంద్రమోది చేయనుండటం గర్వకారణం.
23 వ తారీకున ఈ సదస్సు ప్రారంభొపన్యాసం నరేంద్రమోది గారు చేయనుండగా, చివరి రొజైన 26 న వీడ్కొలు ప్రసంగం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయనున్నారు. కాగా భారీ ఏత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి మోది గారు, ఈ సద్దస్సుకు పెద్ద ఏత్తున మంది మార్బలంతొ దావొస్ వెళుతున్నారు. ఈ సదస్సుకు మొది గారితొ పాటు 100 మంది భారత కంపెనీల CEO లు, ఆరుగురు కేంద్ర మంత్రులు (, పియూష్ గొయల్, సురేష్ ప్రభు, అరుణ్ జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్, MJ. అక్బర్, జితేంద్ర సింగ్) లతొ పాటు మహారాస్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లు కూడా హాజరవనున్నారు. మొత్తంగా మోది గారు ఈ సదస్సుకు తనతొ పాటు 129 మందిని వెంట పెట్టుకుని దావొస్ సభలకు హాజరవుతున్నారు.

.

 

ఈ సదస్సుకు  అమెరికా నుండి అమెరికా అధ్యక్షునితొ సహా 780 మంది CEO లు, అత్యున్నత స్థాయి అధికారులు, రాస్ట్రాల గవర్నర్లు హజరవుతుండగా …. బ్రిటన్ నుండి 266 మంది, స్విడ్జర్లాండ్ నుండి 233 మంది ఈ సదస్సులొ పాల్గొననుండగా, 129 మందితొ ఏక్కువ మంది ప్రతినిధులు పాల్గొంటున్న దేశంగా భారత్ నాలుగవ స్థానంలొ నిలిచింది. 118 మంది సభ్యులతొ చైనా, మన వెనుక స్థానంలొ ఉండటం చెప్పుకొతగ్గ మరొక పరిణామం.

కాగా దావొస్ లొ జరగనున్న ఈ 48 వ ప్రపంచ ఆర్ధిక సదస్సులొ Center of Attraction గా మోది గారు నిలవనున్నారు.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!