చరిత్రలొ మొదటిసారి యుధ ప్రాతిపదికన పెద్ద మొత్తంలొ అత్యాధునిక రైఫిల్స్ ను కొనుగొలు చేస్తున్న భారత్

Share the Post
#Bharatjago : యుధప్రాతిపదికన అత్యాధునికమైన అసాల్ట్ రైఫిల్స్, కార్బైన్ల కొనుగొలు ప్రక్రియ కు రక్షణశాఖ పచ్చజెండా ఊపింది. మొత్తంగా 3,417 కొట్ల రూపాయలతొ 1,66,000 అత్యాధునికమైన అసాల్ట్ రైఫిల్స్, కార్బైన్ల ను కొనుగొలు చేయడానికి, భారత రక్షణ శాఖామంత్రి   నిర్మలా సీతారామన్ గారి ఆద్వర్యంలొ జరిగిన DAC సమావేశంలొ నిర్ణయం తీసుకున్నారు. వీటిలొ 83,895 కార్బైన్లను , 72,400 అసాల్టు రైఫిల్స్ ను యుధ ప్రాతిపదికన కొనుగొలు చేసి ఈ సంవత్సరమే Armed Forces కు అందించనున్నారు. 500 మీటర్లకు పైగా దూరంలొ ఉన్న లక్ష్యాలకు కూడా ఖచ్చితంగా ద్వంసం చేసే ఆయుధాల (రైఫిల్స్) కొసం, ఇమీడియట్ గా టెండర్లను పిలవనున్నారు.
.
 
నిజానికి 2006 లొనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ, ఈ ప్రాజెక్టు పట్టాలేక్కలేక పొయింది. 2014 లొ మోది ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఆయుధాల కొనుగొళ్ళకు సంబందించి టెండర్లను పిలిచారు. అయితే ఆ టెండర్లలొ పాల్గొన్న కంపెనీలకు చెందిన ఆయుధాలు మన ఆర్మీ అవసరాలకు తగ్గట్టు లేకపొవడం, షూటింగ్ ట్రైల్స్ లొ మిగిలిన కంపెనీలకు చెందిన ఆయుధాలు ఫెయిలవగా, కేవలం ఇజ్రాయిల్ చెందిన ఒకేఒక్క కంపెనీ అనీ పరీక్షలలొ పాసయి ఫైనల్ లిస్టు లొ నిలిచింది. అయితే రక్షణ శాఖ నియమాల ప్రకారం కనీసం రెండు కంపెనీలు ఫైనల్ లిస్టులొ ఉండాలి. వాటిలొ ఏ కంపెనీ తక్కువ రేటుకు అమ్మితే ఆ కంపెనీ నుండి ఆయుధాలను కొనుగొలు చేయాలనే నియమాన్ని అనుసరించి, 2016 లొ ఈ టెండర్లను రక్షణ శాఖ రద్దు చేసింది.
 
అయితే ఆర్డినెన్స్ బొర్డ్ ఫ్యాక్టరీ, స్వదేశీయంగా తయారు చేసిన 7.62mm assault rifles, Excalibur గన్సు , తమ అవసరాలకు తగ్గట్టుగా లేవని ఇండియన్ ఆర్మీ తిరస్కరించడంతొ, ఇక యుధ ప్రాతిపదికన 1,66,000 ఆయుధాలను కొనుగొలు చేయాలని రక్షణశాఖ నిర్ణయించుకుంది. ఏట్టి పరిస్తితులలొ ఈ సంవత్సరంలొనే ఈ ఆయుధలను Armed Forces కు అందిస్థామని రక్షణశాఖ తెలియజేసింది. కాగా ఈ అయుధాలను సరిహదుల వద్ద పనిచేసే సైనికులకు, కౌంటర్ ఆపరేషన్స్ నిర్వహించే ప్రత్యేక దళాలకు వీటిని అందివ్వనున్నారు.
.
 
కాగా ఆర్డినెన్స్ బొర్డ్ ఫ్యాక్టరీ తయారు చేసిన Assault rifles, Excalibur గన్సు ను కేంద్ర రిజర్వు బలగాలకు అందజేస్తున్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!