Breaking News : హజ్ సబ్సిడీ పై అతి పెద్ద నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం

Share the Post
#Bharatjago : హజ్ సబ్సిడీ పై మోది ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హజ్‌ యాత్రికులకు ఇచ్చే రాయితీలను ఈ సంవత్సరం నుండి ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం హజ్ సబ్సిడీ కి దాదాపు 700 కొట్లు ఖర్చవుతున్నట్టు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నక్వీ తెలియజేశారు. ఈ నిధులను మైనారిటీల విద్యాభివృద్ధి, ఆ సమాజంలోని బాలికల సంక్షేమం కోసం, ముస్లిం బాలికల విద్య పై వినియోగిస్తామని అబాస్ నఖ్వీ పేర్కొన్నారు.
.
 
హజ్‌ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ద్వారా ఏజెంట్లు మాత్రమే లాభపడుతున్నారని, ముస్లింలు లాభం పొందడం లేదని అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఈ సంవత్సరం నమొదు చేసుకున్న 1.75లక్షల మంది యాత్రికులు ఎటువంటి రాయితీ లేకుండా భారత్ నుండి మొదటిసారి హజ్‌ యాత్రకు వెళ్తున్నట్లు ఆయన తెలియజేశారు. కాగ భారతదేశం లౌకిక రాజ్యం కావడంతొ అన్ని మతాలకు సమాన అవకాశాలు ఉండాలనే ఉదేశ్యంతొ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
 
కాగా ప్రస్తుత పరిస్తితులలొ ఇటువంటి అతి పెద్ద నిర్ణయం తీసుకొవడమంటే మాటలు కాదు. విదేశీ శక్తులు, కొన్ని దేశీయ శక్తులు కలిసి మొది ప్రభుత్వం పై పెద్ద ఏత్తున కుట్రలకు తెరలేపుతున్న ఈ పరిస్తితులలొ, మొది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొవడం సంచలనమే అని చెప్పాలి.
 
2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించిన సంగతి తెలిసిందే.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!